Site icon HashtagU Telugu

Sandeep Reddy Vanga : ప్రోమోతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సందీప్..ఇది కదా రేంజ్ అంటే

Sandeep Vanga Interview

Sandeep Vanga Interview

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఓ విభిన్నమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy)తో సంచలనాన్ని సృష్టించిన ఆయన, అదే సినిమాను ‘కబీర్ సింగ్’ (Kabir Singh) గా బాలీవుడ్‌లో రీమేక్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ ఆ సినిమా విడుదలైనప్పటి నుంచి పురుషాధిక్యతను ప్రోత్సహించాడని, సమాజాన్ని తప్పుదోవ పట్టించాడని బాలీవుడ్ క్రిటిక్స్ తీవ్ర విమర్శలు చేశారు. బాలీవుడ్‌లో ఇదే తరహా విషయాలు ఉన్న అనేక సినిమాలు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా ‘కబీర్ సింగ్’ను టార్గెట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ విమర్శలు వచ్చినప్పుడల్లా సందీప్ రెడ్డి తనదైన శైలిలో తాను చెప్పాల్సినదాన్ని స్పష్టంగా చెప్పడమే కాదు, బాలీవుడ్ వారి ద్వంద్వ వైఖరిని బహిరంగంగా ఎండగడుతూ వస్తున్నాడు.

SLBC Tunnel : మళ్లీ కూలే ప్రమాదం..చిక్కుకున్న కార్మిలకులపై ఆశలు వదులుకోవాల్సిందే

‘యానిమల్’ (Animal Movie) సినిమాను కూడా బాలీవుడ్ విమర్శించినప్పటికీ, సినిమా విడుదలైన తరువాత రణబీర్ కపూర్‌ను పొగుడుతూ, కానీ తనని మాత్రం తక్కువ చేసి మాట్లాడడం హిపోక్రసీ కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇటువంటి విషయంలో బాలీవుడ్ లోని కొందరు వైఖరిని ఎండగడుతూ, తాను తీసే సినిమాలు మాత్రమే కాదు, తన ఇంటర్వ్యూలు కూడా బాలీవుడ్ జనాలను తికమక పెట్టేలా ఉంటాయని నిరూపించాడు. ఇటీవల కోమల్ నహతాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవలం ‘కబీర్ సింగ్’ సినిమాలో నటించాడనే కారణంతో ఒక ప్రముఖ నటుడికి సినిమా అవకాశాన్ని నిరాకరించారని బయటపెట్టాడు. అది కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ అని, ఆ నటుడు సోహమ్ మజుందార్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరగడం మరింత చర్చనీయాంశంగా మారింది.

GV Reddy : జీవీ రెడ్డికి టీడీపీ బిగ్ ఆఫర్.. ఏమిటి ? ఎందుకు ?

సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన ఇంటర్వ్యూకి కేవలం ప్రోమో మాత్రమే విడుదలైనప్పటికీ, అది బాలీవుడ్‌లో మరోసారి ప్రకంపనలు సృష్టించింది. బాలీవుడ్‌లో చాలామంది తన సినిమాలను తప్పుబడుతూ, అదే టైంలో రణబీర్ కపూర్‌ను ప్రశంసించడం హిపోక్రసీ కాదా? అని ఆయన అడిగిన ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. ప్రోమోతోనే సంచలనాన్ని రేపిన ఈ ఇంటర్వ్యూ పూర్తిగా విడుదల అయితే, బాలీవుడ్ ప్రముఖులకు సందీప్ రెడ్డి వంగా మరింత షాకింగ్ కౌంటర్లు ఇవ్వబోతున్నాడని సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రోమోతోనే షేక్ చేసిన సందీప్, ఫుల్ ఇంటర్వ్యూతో ఇంకెంత దుమారం రేపుతాడో చూడాలి!