Ram Charan : పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్స్ లో సందీప్ రెడ్డి వంగ ఒకరు. చేసిన మూడు సినిమాలతోనే తన మార్క్ చూపించి, ఫ్యాన్స్ తెచ్చుకొని, టాలీవుడ్ టు బాలీవుడ్ అందరు హీరోలు అతనితో సినిమా చేయాలనుకునేలా చేసాడు. సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. డిసెంబర్ నుంచి ఈ సినిమా షూట్ మొదలవ్వనుందని సమాచారం.
ప్రభాస్ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ తో సినిమా చేయాలి. అధికారికంగా ఈ సినిమా కూడా అనౌన్స్ చేసారు. కానీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కూడా పక్కన పెట్టి ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్నాడు. అట్లీ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంది. ఆ తర్వాతే సందీప్ రెడ్డి వంగ సినిమా చేస్తాడని సమాచారం. ఈ లోపు సందీప్ ప్రభాస్ స్పిరిట్ సినిమా పూర్తి చేసి ఖాళీ అయిపోతాడు.
అందుకే సందీప్ కి రామ్ చరణ్ తో సినిమా సెట్ చేసాడు నిర్మాత విక్కీ అని టాలీవుడ్ టాక్. రామ్ చరణ్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత విక్కీ సందీప్ రెడ్డి – రామ్ చరణ్ కాంబోలో సినిమా ప్లాన్ చేసాడు. ఆల్రెడీ సందీప్ – రామ్ చరణ్ కలిసి మాట్లాడుకోవడం, కథ ఓకే అవ్వడం జరిగిపోయాయట. చరణ్ పెద్ది షూట్ దసరాకి పూర్తవుతుంది. సందీప్ స్పిరిట్ చేసేలోపు చరణ్ సుకుమార్ సినిమా చేసి వస్తాడు. ఆ నెక్స్ట్ చరణ్ – సందీప్ సినిమా చేస్తారని తెలుస్తుంది. దీంతో సందీప్ – బన్నీ సినిమా ఇంకా లేట్ అవుతుందని అంటున్నారు.
Also Read : Game Changer : గేమ్ ఛేంజర్ కి మొత్తం ఎన్ని కోట్ల లాస్ వచ్చిందో చెప్పేసిన తమన్..