Site icon HashtagU Telugu

Prabhas : ప్రభాస్ ‘స్పిరిట్’లో కీర్తి సురేష్ హీరోయిన్.. నిజమేనా..!

Sandeep Reddy Vanga Is Considering Keerthy Suresh As Actress In Prabhas Spirit Movie

Sandeep Reddy Vanga Is Considering Keerthy Suresh As Actress In Prabhas Spirit Movie

Prabhas : ‘కల్కి’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్.. ఆ తరువాత రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలను చేయనున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోయే ‘స్పిరిట్’ సినిమా పై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా..? ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా..? అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ గా నటించనున్నారు.

అంతేకాదు ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్, రూత్‌లెస్ గా ఉండబోతుందట. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని జరుపుతున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఎవరు నటించబోతున్నారు అనేది అందరిలో ఆసక్తిగా మారింది. యానిమల్ సినిమా చూసిన తరువాత చాలా మంది తృప్తి దిమ్రీని హీరోయిన్ గా తీసుకోవాలంటూ సలహాలు కూడా ఇచ్చారు. ఈమధ్య రష్మిక ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందంటూ కామెంట్స్ వినిపించాయి.

ఇక తాజాగా మహానటి కీర్తి సురేష్ పేరు వినిపిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా కీర్తి సురేష్ ని తీసుకోవాలని సందీప్ వంగ భావిస్తున్నారట. ఈక్రమంలోనే ఆమెతో చర్చలు కూడా జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కీర్తి ఈ ప్రాజెక్ట్ లోకి అడుగుపెడుతుందా లేదా చూడాలి. కాగా ఈ సినిమాని ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది.

కాగా ప్రభాస్ ఇప్పటివరకు పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించలేదు. ‘ఏక్ నిరంజన్’ సినిమాలో కేవలం పోలీస్ ఇన్ఫార్మర్ గానే కనిపించారు. ఇప్పుడు స్పిరిట్ సినిమాలో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. దీంతో ఈ మూవీ పై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు.

Also read : Pawan Kalyan : 2007లో జీసస్ క్రీస్తుపై సినిమా తీయాలని అనుకున్న.. కానీ.. పవన్ కామెంట్స్