ఈమధ్య హీరోయిన్స్ కూడా హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు అనిపించేలా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఇదివరకులా కాకుండా హీరోయిన్స్ కూడా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఏ హీరోలేనా చేసేది మేము చేస్తామని ముందుకొస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ యాక్షన్ సీన్స్ లో భాగం అవుతుండగా దాని కోసం కత్తి యుద్ధం, కర్రసాము నేర్చుకుంటున్నారు. ఇక గుర్రపు స్వారి సీన్స్ ఉంటే అది కూడా నేర్చేసుకుంటున్నారు. ఐతే ఈ లిస్ట్ లో కొత్తగా మలయాళ భామ సంయుక్త (Samyuktha Menon) కూడా చేరింది.
మలయాళం నుంచి వచ్చి తెలుగులో సత్తా చాటుతున్న హీరోయిన్స్ లో సంయుక్త మీనన్ ఒకరు. ఆమె చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబడుతున్నాయి. అందుకే అమ్మడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. చివరగా కళ్యాణ్ రామ్ తో డెవిల్ (Devil) సినిమాలో నటించిన సంయుక్త ప్రస్తుతం నిఖిల్ తో స్వయంభు (Swayambhu) సినిమా చేస్తుంది.
ఈ సినిమాలో నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపించనున్నాడు. ఐతే హీరోయిన్ గా సంయుక్త కూడా గుర్రపు స్వారి నేర్చుకుంటుంది. దానికి సంబందించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది సినిమా కోసం నేర్చుకుంటుందా లేక తన క్యాజువల్ ట్రైనింగా అన్నది తెలియదు కానీ. గుర్రం పక్క తన లుక్స్ తో సంయుక్త అదరగొట్టేస్తుంది.
అలా కళ్లతో మ్యాజిక్ చేసే పవర్ ఉంది కాబట్టే అమ్మడు ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతుంది. తెలుగులో మరో సూపర్ హిట్ పడితే మాత్రం ఈసారి సంయుక్త దూకుడు ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పొచ్చు. మరి స్వయంభుతో సంయుక్తకి ఆశించిన రేంజ్ హిట్ వస్తుందా లేదా అన్నది చూడాలి.
Also Read : Premalu : ప్రేమలు అక్కడ వరస్ట్ రికార్డ్..!