Samyukta Menon : లక్కీ హీరోయిన్ టాలీవుడ్ కథ అప్పుడే ముగిసిందా.. అలా పక్కన పెట్టేశారేంటి..?

Samyukta Menon మలయాళం నుంచి వచ్చే భామలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ సత్తా చాటుతున్న కొందరు టాలీవుడ్ లో కూడా తమ లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తుంటారు.

Published By: HashtagU Telugu Desk
Samyuktha

Samyuktha

Samyukta Menon మలయాళం నుంచి వచ్చే భామలకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అక్కడ ఆల్రెడీ సత్తా చాటుతున్న కొందరు టాలీవుడ్ లో కూడా తమ లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తుంటారు. అలా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చి లక్కీ హీరోయిన్ అనిపించుకుంది సం యుక్త మీనన్. భీంలా నాయక్ లో తక్కువ రోల్ అయినా మెప్పించిన అమ్మడు బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుసగా చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లు అందుకుంది.

చివరగా వచ్చిన డెవిల్ సరైన ఫలితం అందుకోలేదు కానీ మొన్నటిదాకా సం యుక్త అంటే లక్కీ హీరోయిన్, గోల్డెన్ హ్యాండ్ అనేశారు. అయితే ఈ లక్కీ హీరోయిన్ కు ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న స్వయంభు సినిమాలో తప్ప సం యుక్త మరే సినిమా సైన్ చేయలేదు. సం యుక్తని కావాలని పక్కన పెట్టారా లేక తనే సినిమాలు చేయట్లేదా అన్నది తెలియదు కానీ సం యుక్త చేతిలో ఒకే ఒక్క ఆఫర్ మాత్రమే ఉంది.

నిన్నటి మొన్నటిదాకా సం యుక్త అంటే చాలు ఒక రేంజ్ లో హడావిడి కనిపించింది. కానీ ఇప్పుడు అదంతా ఏమి లేదు. చేతిలో ఉన్న స్వయంభు సినిమా తోనే సం యుక్త మళ్లీ తన సత్తా చాటాల్సి ఉంది. తెలుగులో సం యుక్తకు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో విఫలమైంది అమ్మడు.

రెండు మూడు హిట్లు పడగానే వరుస సినిమాలు చేస్తూ వెళ్తే కెరీర్ ఫాం కొనసాగించే ఛాన్స్ ఉండేది. కానీ తనకు నచ్చిన కథలే చేస్తా అందులోనూ పాత్ర బలంగా ఉంటేనే చేస్తానని కూర్చుంటే మాత్రం వెనకబడాల్సి వస్తుంది. మరి సం యుక్త మళ్లీ తిరిగి టాలీవుడ్ లో పికప్ అవుతుందా లేదా అన్నది చూడాలి.

Also Read : Ram : అక్కడ మార్కెట్ చూసుకుని భారీగా పెంచేసిన రామ్.. మైండ్ బ్లాక్ అయ్యే రెమ్యునరేషన్..!

  Last Updated: 19 Apr 2024, 06:54 PM IST