Site icon HashtagU Telugu

Sampoornesh Babu : మోసాన్ని భరించలేక సంపూర్ణేష్ ఇండస్ట్రీకి దూరమయ్యాడా..?

Sampoornesh Babu Industry

Sampoornesh Babu Industry

Sampoornesh Left the Industry : సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) ..ఈ పేరు పెద్దగా సినీ లవర్స్ కు పరిచయం చేయాల్సిన పనిలేదు. హృదయ కాలేయం (Hrudaya Kaleyam) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి..మొదటి సినిమాతోనే ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. ఆ తర్వాత వచ్చిన కొబ్బరి మట్ట కూడా మంచి గుర్తింపే తెచ్చిపెట్టింది. ఆ రెండు సినిమాల విజయాలతో రెట్టింపు ఉత్సాహం తో వరుస సినిమాలు చేసాడు. కానీ అవేవి కూడా విజయాలు సాధించలేకపోయాయి. అదే విధంగా ఛాన్సులు కూడా తగ్గాయి. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని ‘మార్టిన్ లూథర్ కింగ్’ (Martin Luther King) అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ పర్వాలేదు అనిపించింది. ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా ప్రకటించలేదు. దీంతో సినీ లవర్స్ , అభిమానులు సంపూర్ణేష్ ఎందుకు సినిమాలు చేయడం లేదు..అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

కాగా సంపూర్ణేష్ సినిమాలు చేయకపోవడానికి..అసలు ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి నిర్మాత సాయి రాజేష్ కారణం అని ఓ వార్త సోషల్ మీడియా లో వినిపిస్తుంది. డైరెక్టర్ సాయి రాజేష్ (Sai Rajesh) నిర్మాణ సంస్థలో హృదయ కాలేయం సినిమా ద్వారా సంపూర్ణేష్ బాబు మొదటిసారి హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఊహలకు అందని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది. ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. అలాగే ఈ మూవీ ద్వారా నిర్మాత సాయి రాజేష్ కు భారీ లాభాలు వచ్చాయి.

ఆ సినిమాకు కలెక్షన్స్ బాగా వచ్చినా కూడా సంపూ కు సరిగ్గా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని టాక్.. ఆ బాధతోనే సంపూ సినిమాలకు దూరంగా ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఇంతవరకు నిజం అనేది తెలియదు. ఇక ప్రస్తుతం సంపూ తన సొంత ఊరిలో పొలం పనులు చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారట. ఆ పనిలో వచ్చిన డబ్బులతో కొన్ని సేవ కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు సమాచారం. హీరో అయినప్పటికీ కూడ సాధారణ వ్యక్తుల జీవితాన్ని బతికేస్తున్నాడట.. మళ్లీ సినిమాల్లోకి వస్తాడా? లేదా అన్నది చూడాలి.

Read Also : Sleeping Tips : రాత్రి పడుకునే ముందు ఈ ఆహారాన్ని తినడం మానుకోండి..!