Site icon HashtagU Telugu

Samantha : రూమర్ బాయ్ ఫ్రెండ్ తో తిరుమలలో సమంత.. పెళ్లి వార్తలు..?

Samantha Went to Tirumala with her Rumored Boy Friend Raj Nidumoru

Samantha Raj

Samantha : నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన సినిమాలతో బిజీ అయింది. అయితే హెల్త్ బాగోలేదు అని ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. సమంత ఫ్యామిలీ మ్యాన్ దర్శక నిర్మాత రాజ్ నిడుమోరుతో ప్రేమలో ఉందని, డేటింగ్ చేస్తున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. చైతూతో విడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని గతంలో రూమర్స్ కూడా వచ్చాయి.

ఇప్పటికే రాజ్, సమంత కలిసి పలుమార్లు బయట మీడియాకు చిక్కారు. ఇద్దరూ కలిసి బిజినెస్ లు కూడా చేస్తున్నారు. అయితే తాజాగా రాజ్, సమంత ఇద్దరూ కలిసి తిరుమలలో కనపడటంతో ఈ వార్తలు మరోసారి వైరల్ గా మారాయి.

సమంత నిర్మాతగా మారి ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో శుభం అనే సినిమా తెరకెక్కించింది. ఇటీవలే ఆ సినిమా టీజర్ కూడా వచ్చింది. ఈ సినిమా మే 9 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత, తన మూవీ టీమ్ తో కలిసి ఇటీవల ఏప్రిల్ 19న తిరుమల వెళ్లి దర్శనం చేసుకుంది.

అయితే సమంత రూమర్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరు కూడా సమంతతో పాటు తిరుమల వెళ్లడంతో వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో తెలీదు కానీ సమంత – రాజ్ నిడుమోరు బంధంపై రూమర్స్ అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి.

 

Also Read : Vishnupriya : విష్ణు ప్రియ ఎదురుకున్న ఇబ్బందికర పరిస్థితి అదేనట