Site icon HashtagU Telugu

Samantha : ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సామ్..

Samantha

Samantha

క్రేజీ హీరోయిన్ సమంత (Samantha) ..తాజాగా నిర్మాణ రంగంలోకి (Production House) అడుగుపెట్టింది. చిత్రసీమలో ఓ పక్క హీరోగా , హీరోయిన్ గా రాణిస్తూనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ లను స్టార్ట్ చేసి..తమ అభిరుచికి తగ్గట్లు సినిమాలు నిర్మిస్తూ..కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోలుగా రాణిస్తున్న హీరోలంతా సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో సమంత కూడా చేరింది.

We’re now on WhatsApp. Click to Join.

‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ (Tralala Moving Pictures) అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసింది. ఈ విషయాన్నీ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపారు. ఈ సందర్బంగా ‘నా సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవీ పిక్చర్స్‌ను ప్రకటిస్తున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. కొత్త తరం ఆలోచనలను తెరకెక్కించడమే ట్రలాలా పిక్చర్స్ లక్ష్యం. అర్థవంతమైన, కచ్చితమైన, యూనివర్సల్ కథలను చెప్పే ప్లాట్‌ఫాం ఇది.’ అని పోస్టులో పేర్కొంది. ఈ నిర్మాణ సంస్థకు ‘ట్రలాలా మూవీ పిక్చర్స్’ అని ఎందుకు పేరు పెట్టారో కూడా వివరించారు. తన చిన్నప్పుడు విన్న ఇంగ్లిష్ పాట ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్ నౌ’లోని ట్రలాలా అనే పదం నుంచి ఈ పేరు పెట్టినట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్న సామ్…ప్రస్తుతం కోలుకుంటుంది. చివరి సారిగా ఈమె ఖుషి చిత్రంలో నటించింది. ప్రస్తుతం వరుణ్ ధావన్ జోడిగా సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

Read Also : ముంబై షార్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్పెషల్ మెన్షన్ అవార్డు అందుకున్న ‘ఆస్కార్ చల్లగరిగ’