Site icon HashtagU Telugu

Samantha: ఖుషి ప్రమోషన్స్ కు సమంత దూరం, కారణమిదే

Samantha Ruth Prabhu In Sakunthalam Promotion Samantha Is Sparkling In A White Font Suit.

Samantha Ruth Prabhu In Sakunthalam Promotion Samantha Is Sparkling In A White Font Suit.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా విరామం ఇచ్చినట్టు తెలిపిన తర్వాత ఈ బ్యూటీ బాలిలో తన సమయాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది. అందమైన ఫొటోషూట్స్ ను షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లోకి వచ్చింది. ‘ఖుషి’ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత గైర్హాజరు కావడం గమనార్హం. చాలా మంది ఆమె హాజరవుతారని అంచనా వేయగా’ ఆరోగ్య కారణాల వల్ల ఆమె గైర్హాజరైనట్లు వెల్లడైంది. ఆసక్తికరంగా, సినిమాతో సంబంధం ఉన్నప్పటికీ, సమంత ఎలాంటి వీడియో కంటెంట్ లేదా ట్రైలర్ గురించి ఎలాంటి అప్ డేట్స్ షేర్ చేయలేదు.

ఆమె ప్రచార కార్యక్రమాల నుండి గైర్హాజరు కావడానికి గల కారణాల గురించి అభిమానులు ఊహించి ఉంటారు. కానీ సమంత అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలియడం లేదని అంటున్నారు. ఆమె సినిమా కోసం కనీసం ఒక ప్రచార కార్యక్రమంలో పాల్గొనవచ్చని భావిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ‘ఖుషి’ సెప్టెంబర్ 1న విడుదల కానుంది. సినిమాపై అంచనాలు పెరుగుతున్న కొద్దీ, సమంత ఎక్కడా కనిపించకపోవడంతో ఆమె అభిమానులు ఒకింత నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ప్రమోషన్స్ కు వస్తుందా ? లేదా? చర్చనీయాంశమవుతోంది.

Also Read: Jagtial: జగిత్యాలలో విషాదం, కుక్కకాటుతో 12 ఏళ్ల బాలిక మృతి