వెనకబడ్డ ప్రతిసారి రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తుంది సౌత్ స్టార్ హీరోయిన్ సమంత. దాదాపు ఒక హీరోయిన్ గురించి ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఇంతగా ఎవరికీ డిస్కషన్ జరిగి ఉండదు. నాగ చైతన్య (Naga Chaitanya)తో లవ్ మ్యారేజ్ రెండేళ్లకే డైవర్స్ ఆ తర్వాత మయోసైటిస్ వల్ల హెల్త్ ఇష్యూస్ సినిమాలకు దూరం అవ్వడం ఇవన్నీ సమంత కెరీర్ మీద బాగా ఎఫెక్ట్ చూపించాయి.
అయినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా స్ట్రాంగ్ గా నిలబడి ఉంది సమంత. ఈమధ్య ఒక పొలిటికల్ లీడర్ ఇష్యూలో కూడా తన పేరుని ప్రస్తావించడం దాని వల్ల జరిగిన రచ్చ అంతా తెలిసిందే. ఇన్ని జరుగుతున్నా కూడా సమంత ఎక్కడ తగ్గట్లేదు. తనకు కాస్త బ్యాడ్ టైం నడుస్తున్న టైం లో తన ఫ్యాన్స్ ఇంకా ఇండస్ట్రీ తనకు సపోర్ట్ గా ఉన్నందుకు ఆమె సంతోషంగా ఉంది.
కెమెరా రోల్ చేసి యాక్షన్ అనగానే..
ఐతే ఇవన్నీ సమంత నటనని మాత్రం డిస్ట్రబ్ చేయలేకపోతున్నాయి. ఒక్కసారి కెమెరా రోల్ చేసి యాక్షన్ అనగానే ఆమెలోని నటి వీటన్నిటినీ దూరం చేసేలా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసేలా చేస్తుంది. సమంత(Samantha) లో ఉన్న ఈ గొప్ప క్వాలిటీ మరే నటిలో లేదని చెప్పొచ్చు. చిన్న చిన్న వాటికి కూడా మైండ్ అంతా డిస్ట్రబ్ చేసుకుని చేసే పని మీద ఫోకస్ చేయలేని మనుషులు కొందరు ఉంటారు. కానీ పర్సనల్ గా తన గురించి ఎవరు ఎలా అనుకున్నా సరే వాటికి తెర మీద తన నటనతోనే సమాధానం చెబుతుంది సమంత. అందుకే సమంత ఎప్పటికీ మెరిసే బంగారం అని చెబుతుంటారు ఆమె ఫ్యాన్స్.
లేటెస్ట్ గా సిటాడెల్ హనీ బనీ ట్రైలర్ లో మరోసారి సమంత తన యాక్టింగ్ తో అదరగొట్టేసింది. ట్రైలర్ లోనే ఆమె ఇంటెన్స్ యాక్టింగ్ తెలుస్తుంది. కచ్చితంగా సమంతకు సిటాడెల్ (Citadel) సీరెస్ మరోసారి ఆమె కెరీర్ కు బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.
Also Read : Rishab Shetty : జై హనుమాన్ లో కాంతారా స్టార్..?