Site icon HashtagU Telugu

Samantha : రష్మికకు స్పెషల్ గిఫ్ట్ పంపిన సమంత.. బిగ్ లవ్ అంటూ రష్మిక రెస్పాన్స్..

Samantha Sends Special Gift To Rashmika Mandanna

Samantha

Samantha : సాధారణంగా సెలబ్రిటీలు వేరే సెలబ్రిటీలకు అప్పుడప్పుడు గిఫ్టులు పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా బిజినెస్ లు చేసే సెలబ్రిటిలు వాళ్ళ ప్రోడక్ట్స్ ని వేరే సెలబ్రిటీలకు గిఫ్ట్ గా పంపించి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఈ విషయంలో విజయ్ దేవరకొండ అందరికంటే ముందు ఉంటాడు. రెగ్యులర్ గా విజయ్ తన రౌడీ బ్రాండ్ బట్టలను సినీ పరిశ్రమలోని పలువురికి గిఫ్ట్ గా పంపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ బాటలోకి సమంత చేరింది.

సమంత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నా తన బిజినెస్ లతో బిజీగా ఉంది. ఓ పక్క పిల్లల స్కూల్స్ నడుపుతూ, మరో పక్క పికెల్ బాల్ టీం కొని ఇంకో పక్క సాకీ అనే బ్రాండ్ తో ఓ బట్టల బిజినెస్ కూడా నడుపుతుంది. తాజాగా సమంత తన సాకీ బ్రాండ్ డ్రెస్ ఒకటి రష్మికకు పంపించింది. రష్మిక ఆ డ్రెస్ ని ఫోటో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సమంత పంపించిన ఈ స్పెషల్ డ్రెస్ ని రష్మిక ఫోటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. నీకు బిగ్ లవ్. నువ్వు చేసే ప్రతి పనికి బెస్ట్ విషెష్ అంటూ సమంతను, సాకీ బ్రాండ్ ని ట్యాగ్ చేసింది. దీంతో సమంత, రష్మిక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత ఇలా ఫ్రీగా డ్రెస్ పంపించి ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న నేషనల్ క్రష్ తో ఫ్రీగా ప్రమోషన్ కొట్టేసింది అంటున్నారు పలువురు రష్మిక ఫ్యాన్స్.

ఇక రష్మిక ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ ఫామ్ లో ఉంది. ఇటీవలే పుష్ప 2, చావా సినిమాలతో భారీ పాన్ ఇండియా హిట్స్ సాధించింది.

Also Read : Shivangi Trailer : ఆనంది ‘శివంగి’ ట్రైలర్ రిలీజ్.. సత్యభామ రా..సవాల్ చేయకు..చంపేస్త..