Samantha : ఆరోగ్య సమస్యలతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటుంది. తన బిజినెస్ లు, హెల్త్ పాడ్ కాస్ట్ లు చేస్తూ బిజీగానే ఉంటుంది. ప్రస్తుతం సమంత చేతిలో ఒక సిరీస్, ఒక సినిమా ఉంది. నెట్ ఫ్లిక్స్ నిర్మాణంలో ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ అనే వెబ్ సిరీస్ లో సమంత నటిస్తుంది. ఈ ప్రాజెక్టు ఆర్ధిక సమస్యల వల్ల ప్రస్తుతానికి ఆగిందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక తన నిర్మాణ సంస్థలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాని ప్రకటించింది.
సమంత చేతిలో ఆ రెండు ప్రాజెక్ట్స్ తప్ప ఇంకేమి లేవు. వేటికి కూడా ఓకే చెప్పట్లేదని సమాచారం. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.
ఈ క్రమంలో మీరు ఇటీవల జీవితంలో నేర్చుకున్న పాఠం ఏంటి అని అడగ్గా.. నేను ఇటీవల కొన్ని రోజులు ఫోన్ కి దూరంగా ఉన్నాను. ఫోన్ లేకపోవడంతో మరో ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది. దానికి ఎంతగా అడిక్ట్ అయ్యామో తెలిసింది అని చెప్పుకొచ్చింది.
అలాగే తన ఫేవరేట్ హీరోయిన్స్ గురించి అడగ్గా ఫేవరేట్ హీరోయిన్స్ కాదు కానీ ఇటీవల నేను చూసిన బెస్ట్ పెర్ఫార్మన్స్ లు అంటూ.. పార్వతీ తిరువోతు (ఉల్లొళుక్కు), సాయి పల్లవి (అమరన్), నజ్రియా (సూక్ష్మదర్శిని), అలియా భట్ (జిగ్రా), అనన్య పాండే (CTRL), దివ్య ప్రభ (ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్).. అంటూ వీళ్ళ పేర్లు చెప్పింది. ఫ్యాన్స్ మాత్రం సమంత ఎప్పుడు మళ్ళీ సినిమాల్లో కనిపిస్తుందో అని ఎదురుచూస్తున్నారు.
Also Read : MS Dhoni : బాలీవుడ్ స్టార్ తో కలిసి ధోని.. మూవీ షూటింగ్ లో ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ చూస్తూ..