Samantha Birthday : సమంత కెరీర్‌లో ఎలాంటి టఫ్ టైమ్స్‌ను చూశారో తెలుసా ?

Samantha Birthday : ఇవాళ (ఏప్రిల్ 28న) ప్రముఖ హీరోయిన్ సమంత 37వ పుట్టినరోజు.

  • Written By:
  • Publish Date - April 28, 2024 / 01:57 PM IST

Samantha Birthday : ఇవాళ (ఏప్రిల్ 28న) ప్రముఖ హీరోయిన్ సమంత 37వ పుట్టినరోజు. 2010 సంవత్సరంలో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది సామ్.. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తనపై ఎన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చినా.. సమంత వాటిని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఓ వైపు కెరీర్‌లో.. మరోవైపు రియల్ లైఫ్‌లోనూ ఆమె ఎన్నో సవాళ్లను  ఎదుర్కొన్నారు. అటువంటి స్ఫూర్తిదాయక పయనం సాగిస్తున్న సమంతకు ఇవాళ ఫ్యాన్స్ నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

  • స్టార్ హీరోయిన్ సమంత బాల్యంలో చాలా తెలివైన స్టూడెంట్.
  • ఆమె నటనా ప్రపంచంలోకి ఊహించని విధంగా అడుగుపెట్టారు.
  • ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేక సమంత(Samantha Birthday)  చదువుకునే టైంలో చిన్నచిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. 
  • సమంత ఇంటర్ చదువుతుండగా ఎనిమిది గంటల షిఫ్ట్ కోసం ఒక కాన్ఫరెన్స్  హాల్‌లో హోస్టెస్ గా పనిచేశారు. అందుకోసం ఆమెకు రూ.500 జీతంగా ఇచ్చారు. 
  • కాలేజీలో ఉండగా సమంత మోడలింగ్‌పై ఆసక్తి చూపారు. 
  • ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆమె ఉన్నత విద్య కోసం ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయారు.
  • ఈక్రమంలో ఫ్యామిలీకి అండగా ఉండేందుకు ఫుల్ టైమ్ మోడలింగ్ వర్క్‌లను సమంత చేశారు.
  • సమంతకు సినిమాల్లో తొలి అవకాశాన్ని దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ ఇచ్చారు. దాంతో ఆమె జీవితం మారిపోయింది.
  • నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తో ‘మాస్కోఇన్ కావేరి’ మూవీ సమంత తొలి మూవీ. అయితే ఈ సినిమా కంటే ముందే ఏ మాయ చేశావే విడుదలైంది.
  • టాలీవుడ్ అగ్రనిర్మాత అల్లు అరవింద్.. ఓ సందర్భంలో ఈ జెనరేషన్ హీరోయిన్​లలో సమంతను మరో సావిత్రిగా పోల్చడం గమనార్హం. సమంత తన నటనతో అంతటి పేరును సంపాదించుకుంది.
  • ఎన్‌టీఆర్, మహేశ్ బాబు లాంటి నటులతో జతకట్టి హిట్లు కొడుతూ గోల్డెన్ లెగ్ అనే ట్యాగ్‌ను కూడా సమంత దక్కించుకుంది.
  • తమిళంలో కూడా సమంత ఒక సక్సెస్‌ఫుల్ కెరీర్‌ను కొనసాగించింది.

Also Read : Sunetra vs Supriya : శరద్ పవార్‌కు అగ్నిపరీక్ష.. శివాజీ వారసుడికి ఒవైసీ మద్దతు

  • సమంత, నాగచైతన్య కలిసి నాలుగు సినిమాల్లో నటించారు.
  • 2017లో పెళ్లి చేసుకున్న సమంత, నాగచైతన్య.. 2021లో విడాకులు తీసుకున్నారు.
  • 2021లో విడాకులను ప్రకటించిన తర్వాత 2022లో తాను మాయాసైటీస్ అనే ఇమ్యూనిటీ వ్యాధితో బాధపడుతున్నానని సమంత బయటపెట్టింది. దాని వల్ల పర్సనల్‌గా తను చాలా వీక్ అయిపోయింది. అందుకే తన వద్దకు వచ్చిన సినిమా అవకాశాలను కూడా వదులుకుంది.
  • సమంత జీవితంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన మరో అంశం ‘ప్రత్యూష ట్రస్ట్’. తన కెరీర్ ప్రారంభంలోనే అనాథ పిల్లలకు సాయం చేయడం కోసం ఈ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి తన జీవితంలోని ప్రతీ స్పెషల్ సందర్భాన్ని ఆ పిల్లలతోనే జరుపుకుంటుంది సామ్.

Also Read :MP Candidates Qualifications : లోక్‌‌సభ అభ్యర్థుల విద్యార్హతల చిట్టా ఇదిగో..