Samantha-‘Chay’ Tattoo Missing : సామ్..చైతు పేరుటాటూను లేపేసింది

సమంత పక్కటెముకుల మీద ఉండాల్సిన చైతూ పేరు టాటూ ఇప్పుడు కనిపించడం లేదు. గతంలో చుట్టు టాటూ ఉండగా..ఇప్పుడు దానిని తీసేసినట్లు తెలుస్తుంది

Published By: HashtagU Telugu Desk
Naga Chaitanya Tattoo

Naga Chaitanya Tattoo

సమంత (Samantha)..ఈ పేరు నిత్యం మీడియా లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. సినిమాల పరంగా , ఆరోగ్యం పరంగా , చైతు (Naga Chaitanya)విషయం లో ఇలా ఎప్పుడు సామ్ గురించి ఏదొక న్యూస్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఏమాయ చేసావే (Yemaya Chesave) అంటూ అందర్నీ మాయ చేసిన సమంత..ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ గా చలామణి అయ్యింది. అదే తరుణంలో నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని (Naga Chaitanya – Samantha Wedding) వైరల్ గా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం కన్నులపండుగ జరిగింది. ఆ తర్వాత కొంతకాలానికే విడాకులు (Naga Chaitanya Samantha divorce) తీసుకొని షాక్ ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

విడాకుల అనంతరం సమంత అనారోగ్యానికి గురి కావడం..చికిత్స తీసుకోవడం ఇలా జరిగింది. ప్రస్తుతం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. పూర్తిగా ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యింది. మయోసిటిస్ (Myositis ) చికిత్స, మనశ్శాంతి కోసం విదేశాలు వెళ్ళింది. అక్కడి ప్రదేశాలను తిరిగేస్తూ ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు అక్కడ దిగిన ఫొటోలనూ సోషల్​ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా సామ్ పింక్ కలర్ శారీలో ఫోటో షూట్ చేసింది. అయితే ఈ ఫొటోలో సమంత అందాలతో పాటు నెటిజెన్స్ మరొకటి గమనించారు. అదేంటంటే.. సమంత పక్కటెముకుల మీద ఉండాల్సిన చైతూ పేరు టాటూ (Naga Chaitanya Tattoo) ఇప్పుడు కనిపించడం లేదు. గతంలో చుట్టు టాటూ ఉండగా..ఇప్పుడు దానిని తీసేసినట్లు తెలుస్తుంది.

చైతూ ఆనవాళ్ళు మనసులోనే కాదు తన ఒంటి మీద లేకుండా చెరిపేసుకుంది అనడానికి ఇదే ఉదాహరణ. ప్రస్తుతం చై టాటూను సామ్ తొలగించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజెన్స్ ఆ టాటూ ఏమైందని తెగ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య పేరుని సమంత పూర్తిగా తొలిగించిందా..? లేదా సినిమాల్లో కవర్ చేసినట్లు ఈ ఫోటోషూట్​లో కూడా కవర్ చేసిందా..? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Black Day – Friday : బ్లాక్ డే – ఫ్రైడే.. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఐటీ ఉద్యోగుల మ‌రో వినూత్న నిర‌స‌న‌

  Last Updated: 12 Oct 2023, 10:56 AM IST