Samantha in Mumbai: ముంబైలో సమంత.. కొత్త లుక్ లో అదుర్స్!

వైట్ అండ్ వైట్ దుస్తుల్లో, కొత్త హెయిర్ స్టైల్ తో (Hair Cut) ఆకట్టుకుంది సమంత.

Published By: HashtagU Telugu Desk
Samantha

Samantha

టాలీవుడ్ నటి సమంత (Samantha) వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల శాకుంతల మూవీ ట్రైలర్ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన సమంత తాజాగా మరోసారి ముంబైలో (Mumbai) మెరిసింది. సమంత కొత్త లుక్ లో కనిపించింది. వైట్ అండ్ వైట్ దుస్తుల్లో, కొత్త హెయిర్ స్టైల్ తో (Hair Cut) ఆకట్టుకుంది. ఎప్పటికప్పుడు తన వార్డ్ రోబ్ ను మార్చే సామ్ డిఫరెంట్ ఫ్యాషన్ స్టైల్స్ ను ఫాలో అవుతుంటుంది. ఈ బ్యూటీకి ఎలాంటి దుస్తులు అయినా ఇట్టే యాప్ట్ అవుతాయి. సినిమా హీరోయిన్స్ కాకుండా, లేడీ ఫ్యాన్స్ కూడా డ్రస్సుల విషయంలో సమంతను బాగా ఫాలో అవుతుంటారు.

సమంత (Samantha) కూడా ఫ్యాషన్ విషయానికి వస్తే ప్రయోగాలు చేయడానికి భయపడదు. “నా స్టైల్ ఎప్పుడైనా సౌకర్యంగా ఉంటుంది, చిక్‌గా ఉంటుంది. కొంచెం ప్రయోగాత్మకంగా ఉంటుంది” అని సమంతా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో (Interview) చెప్పింది. వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సిటాడెల్ సినిమా షూటింగ్ ప్రారంభించడానికి సమంత ముంబైలో ల్యాండ్ అయింది. ఇటీవల వ్యాధి కారణంగా సమంత చాలా రోజులు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఫిటెనెస్ ట్రైనర్ సలహాలు, సూచనలతో త్వరగా కోలుకుంది. అయితే సమంత లేటెస్ట్ పిక్స్ (Latest Pics)ను చూస్తే క్షేమంగా ఉన్నట్టు కనిపించింది. మునుపెన్నడూ లేని విధంగా హుషారుగా కనిపించి జోష్ నింపింది.

సమంత విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న ఖుషి (Kushi) సినిమా కోసం డేట్స్ కేటాయించనునుంది. యశోదలో చివరిగా కనిపించిన సామ్ తదుపరి శాకుంతలం ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాళిదాసు రచించిన ప్రముఖ భారతీయ నాటకం శకుంతల ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సమంతా రూత్ ప్రభు (Samantha) శకుంతల టైటిల్ పాత్రలో కనిపిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతగా కనిపించనున్నారు.  అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా ఈ సినిమాతో తొలిసారిగా నటిస్తోంది.

Also Read: Keerthy Suresh Gifts: దటీజ్ మహానటి.. చిత్ర యూనిట్ కు గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్!

  Last Updated: 20 Jan 2023, 04:53 PM IST