Samantha : హీరోయిన్ సమంత తన అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ (ఎక్స్) వేదికగా రెగ్యులర్‌గా పోస్టులు పెడుతూ తన జీవితంతో ముడిపడిన కీలక వివరాలను అందరితో పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆమె ఇన్‌స్టాలో ఒక స్టోరీ పెట్టారు. ఇటీవలే తనకు చికెన్ గున్యా వచ్చిందని, దాని వల్ల అలుముకున్న కీళ్ల నొప్పుల నుంచి కోలుకుంటున్నానని సమంత వెల్లడించారు. ఓ వైపు చికెన్ గున్యా బారినపడినా.. జిమ్ చేయడాన్ని ఆమె ఆపలేదు. ఈ పోస్ట్‌లో తాను జిమ్ చేస్తున్న ఒక ఫొటోను సమంత జతపరిచారు. ‘‘చికెన్ గున్యా వల్ల వచ్చిన కీళ్లనొప్పుల నుంచి కోలుకోవడంలోనూ చాలా ఫన్ ఉందండోయ్’’ అనే కామెంటుకు బాధతో కూడిన ఎమోజీలను సమంత జతచేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. సమంత(Samantha) త్వరగా చికెన్ గున్యా నుంచి, కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవాలని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఫిట్‌నెస్, డైట్‌లపై సమంత ఎక్కువ ఫోకస్ పెడుతుంటారు.
Also Read :Kerala Shocker : అథ్లెట్‌పై అమానుషం.. ఐదేళ్లలో 60 మంది లైంగిక వేధింపులు
సమంత బిజీబిజీ
సమంత నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ప్రియాంకా చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇది ఇండియన్ వర్షన్. తదుపరిగా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో సమంత మనకు కనిపించబోతున్నారు. ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్‌లో కూడా సమంత సందడి చేయనున్నారు.
Also Read :Police Personnel Suicides : పోలీసు సిబ్బంది సూసైడ్స్ కలకలం.. వ్యక్తిగత కారణాలు, ఉద్యోగ ఒత్తిడి వల్లే!
2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్య.. 2021లో విడాకులు తీసుకున్నారు. వీళ్ళిద్దరూ ఏ కారణంతో విడిపోయారో ఎవరికీ తెలియదు. ఈనేపథ్యంలో నాగచైతన్య డిసెంబర్ 4 న శోభిత దూళిపాళ్లతో రెండో వివాహం చేసుకున్నారు. సమంత మాత్రం కెరీర్‌పై పూర్తి ఫోకస్‌తో దూసుకుపోతున్నారు. తన నటనతో సినీ ప్రియులు మెప్పును పొందుతున్నారు.