Site icon HashtagU Telugu

Samantha Injured: యాక్షన్ సీన్స్ ఎఫెక్ట్.. సమంతకు గాయాలు!

Samantha

Samantha

స్టార్ హీరోయిన్ సమంత (Samantha)కు గాయాలైనట్టు తెలుస్తోంది. షూటింగ్ లో భాగంగా ఆమె చేతులు దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయి. ఇటీవల సమంత ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ కోసం సమంత సెట్స్ లో అడుగుపెట్టింది. అయితే వెబ్ సిరీస్‌లో కొన్ని హై యాక్షన్ సీన్స్ ఉన్నాయి. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సమంత (Samantha)కు ట్రైనింగ్ ఇస్తున్నాడు. అయితే ఇందులో భాగంగా సమంత చేతులకు రక్తపు మరకలు, మచ్చలు ఏర్పడి గాయాలపాలైంది. ప్రస్తుతం ఈ భామ వరుణ్ ధావన్ నటిస్తున్న హిందీ సిరీస్ ‘సిటాడెల్’లో నటిస్తోంది. అయితే సమంత పాత్ర పూర్తిగా యాక్షన్‌తో కూడుకున్నది.

సిటాడెల్ సెట్స్ లో గాయపడిన సమంత (Samantha) అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొన్ని రోజుల క్రితం యాక్షన్ డైరెక్టర్ యాన్నిక్ బెన్‌తో కలిసి యాక్షన్ సన్నివేశాలను ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసింది. తీవ్ర చలిలో ఎనిమిది డిగ్రీల సెల్సియస్‌లో యాక్షన్ షూట్‌ లో సమంత పాల్గొంది. ఆ సమయంలోనే సమంతకు గాయాలై ఉండొచ్చు. ‘సిటాడెల్’ అనేది దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ రూపొందించిన అంతర్జాతీయ సిరీస్‌కి (Web series) భారతీయ అనుకరణ. ఈ సిరీస్ గ్లోబల్ వెర్షన్‌లో ప్రియాంక చోప్రా జోనాస్, రిచర్డ్ మాడెన్ నటించారు.

Also Read: Trivikram and Pooja Hegde: బుట్టబొమ్మ మాయలో గురూజీ.. పూజహెగ్డేకు కార్ ఆఫర్!