నాగచైత‌న్య ఫోటోల‌ను డిలీట్ చేసిన స‌మంత‌..

నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న వారం త‌ర్వాత న‌టి స‌మంత ఇన్‌స్టాలో అత‌నితో క‌లిసి దిగిన ఫోటోల‌న్నీ డిలీట్ చేసింది. త‌మ పెళ్లి ఫోటోల‌తో స‌హా హాలీడేస్ వెళ్లిన‌ప్పుడు తీసుకున్న ప‌ర్స‌న‌ల్ ఫోటోల‌ను కూడా తొల‌గించింది.

  • Written By:
  • Publish Date - October 28, 2021 / 02:39 PM IST

నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకున్న వారం త‌ర్వాత న‌టి స‌మంత ఇన్‌స్టాలో అత‌నితో క‌లిసి దిగిన ఫోటోల‌న్నీ డిలీట్ చేసింది. త‌మ పెళ్లి ఫోటోల‌తో స‌హా హాలీడేస్ వెళ్లిన‌ప్పుడు తీసుకున్న ప‌ర్స‌న‌ల్ ఫోటోల‌ను కూడా తొల‌గించింది.

స్పెయిన్‌, ఆమ్‌స్ట‌ర్‌డామ్‌, రాణా వివాహం, క్రిస్మ‌స్ సెల‌బ్రేష‌న్‌.. ఇలా చాలా సందర్భాల్లో నాగ‌చైత‌న్య‌తో దిగిన ఫోటోలు అప్ప‌ట్లో స‌మంత ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే, ఇప్పుడు అవి క‌నిపించ‌డంలేదు. వాటిని స‌మంత తొల‌గించిన‌ట్టు తెలుస్తోంది. కొంత‌మంది మిత్రులతో క‌లిసి దిగిన ఫోటోలు, పెట్స్‌తో దిగిన మ‌రికొన్ని ఫోటోలు మాత్ర‌మే ఇప్పుడు ఇన్‌స్టాలో ఉన్నాయి.

ఇప్ప‌టికీ ఇన్‌స్టాలో ఉన్న నాగ‌చైత‌న్య‌, స‌మంత ఫోటోలు ఇవే!

 

న‌వంబ‌ర్ 2017లో ఈ ఫోటోను స‌మంత షేర్ చేసింది.

సెప్టెంబ‌ర్ 2018లో ఈ ఫోటోను స‌మంత షేర్ చేసింది.

ఆగ‌స్టు 2020లో ఈ ఫోటోను స‌మంత షేర్ చేసింది.

 

డిసెంబ‌ర్ 2020లో ఈ ఫోటోను స‌మంత షేర్ చేసింది.

తామిద్ద‌రం విడిపోతున్న‌ట్టు కొద్దిరోజుల క్రితం స‌మ‌త‌, నాగ‌చైత‌న్య‌లు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వాస్త‌వానికి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్స్‌లో స‌మంత అక్కినేని అనే పేరును తొల‌గించి కేవ‌లం ఎస్ అనే అక్ష‌రాన్ని పెట్టిన‌పుడే వారిద్ద‌రూ విడిపోతున్నారంటూ వార్త‌లు వ‌చ్చాయి.,


ఇద్ద‌రూ విడిపోయిన త‌ర్వాత స‌మంత రెండు ట్రిప్స్‌కి వెళ్లివ‌చ్చింది. దుబాయ్ , చార్‌ధామ్ యాత్ర‌లు చేసి ఆ ఫోటోల‌ను కూడా సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది., రిషికేష్‌లో త‌న ఫ్రెండ్‌తో క‌లిసి దిగిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

అటు చైత‌న్య కూడా సెప‌రేట్ అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించిన వారంలోనే ఓ సినిమా ఈవెంట్‌లో కనిపించాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వ‌చ్చిన నాగ‌చైత‌న్య‌,,ఆ త‌ర్వాత త‌మ విడాకుల‌పై ఎలాంటి కామెంట్ చేయ‌లేదు.