Site icon HashtagU Telugu

Samantha: సిటాడెల్ సిరీస్ కి సమంత రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే?

Mixcollage 21 Mar 2024 01 49 Pm 6268

Mixcollage 21 Mar 2024 01 49 Pm 6268

సమంత మొన్నటి వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన ఆరోగ్యంపై ఫోకస్ చేస్తూ బిజినెస్ లు చూసుకుంటూ, హెల్త్ పాడ్ కాస్ట్ లు చేస్తూ, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బిజీగానే ఉంది సమంత. సమంత హెల్త్ ప్రాబ్లమ్స్ రాకముందు బాలీవుడ్ లో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత సిటాడెల్ సిరీస్ కూడా చేసింది. ఆ సిటాడెల్ సిరీస్ ఇప్పుడు రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ హనీ బన్నీ అనే టైటిల్ తో ఆ సిరీస్ రాబోతుంది. ప్రస్తుతం ఆ సీరిస్ కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి.

ఇటీవలే అమెజాన్ ఈవెంట్ లో మూవీ యూనిట్ అంతా పాల్గొన్నారు. అయితే ఈ సిరీస్ కి సంబంధించి ఒక ఆసక్తికర టాక్ నడుస్తోంది. సమంత ఈ సిరీస్ కి తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. సాధారణంగా సౌత్ లో కంటే బాలీవుడ్ లో రెమ్యునరేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకే చాలామంది హీరోయిన్స్ ఇక్కడ పేరు తెచ్చుకున్నాక బాలీవుడ్ కి చెక్కేస్తారు. ఇదే కోవలో సమంత కూడా ఉంది. సమంత టాలీవుడ్ లో ఒక సినిమాకి రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేది సమాచారం.

పుష్పలో ఒక్క ఐటెం సాంగ్ కి మూడు కోట్లు తీసుకుందని, అది చాలా హైయెస్ట్ అని ఆ సమయంలో వార్తలు వచ్చాయి. అయితే బాలీవుడ్ లో సిటాడెల్ లో మెయిన్ లీడ్ గా చేసినందుకు సమంతకు పది కోట్లు ఇచ్చారని తెలుస్తోంది సిటాడెల్ సిరీస్ కి గాను సమంత తన కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ 10 కోట్లు తీసుకుందని సమాచారం. దీంతో ఒక్క సిరీస్ కి మరీ అంతా అంటూ ఆశ్చర్యపోతున్నారు అంతా.

Exit mobile version