Konda Surekha : మీ రాజకీయాల కోసం నన్ను వాడుకోకండి – సమంత రియాక్షన్

Konda Surekha : 'మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు'

Published By: HashtagU Telugu Desk
Samantha Reaction On Konda

Samantha Reaction On Konda

నాగచైతన్య-సమంత విడాకుల (Naga Chaitanya – Samantha Divorce)పై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వారి విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్ (KTR), నాగార్జునే (Nagarjuna) కారణమని ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సురేఖ ఈ వ్యాఖ్యలు చేసిన దగ్గరి నుండి సోషల్ మీడియాలో కాంగ్రెస్-బీఆర్ఎస్ తో పాటు చైతూ, సామ్ ఫ్యాన్స్ మధ్య పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. సురేఖ వ్యాఖ్యలపై అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు బిఆర్ఎస్ కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ..సురేఖ క్షేమపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా సురేఖ వ్యాఖ్యలఫై సమంత స్పందించారు. ‘మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అది ఇద్దరి అంగీకారంతో, ఎటువంటి రాజకీయ కుట్ర లేకుండా జరిగింది. దయచేసి నా పేరును రాజకీయాలకు దూరం పెట్టండి’ అని ఓ ప్రకటనలో సూచించారు.

Read Also : Dirty Politics : ఛీ ..ఛీ ..రాజకీయాల కోసం ఇంత దిగజారుతారా..?

సురేఖ వ్యాఖ్యలను ఇండస్ట్రీ లోని పలువురు సైతం రియాక్ట్ అవుతున్నారు. కొందరు మైలేజ్ కోసం సమంత పేరును వాడుకుంటున్నారంటూ సమంత విడాకుల గురించి మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ ఫై సింగర్ చిన్మయి పరోక్షంగా స్పందించారు. సమంత విషయంలో యూట్యూబ్ ఛానళ్లు, మీడియా సంస్థల తీరునూ ఆమె తప్పుబట్టారు. వ్యూస్, లైక్స్, డబ్బు కోసం ఇలా చేయడం బాధాకరమన్నారు.

ఇటు నాగార్జున సైతం సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను’ అంటూ తెలిపాడు.

Read Also : Congress vs Tollywood : కాంగ్రెస్ పార్టీ వల్ల చిత్రసీమ కళ తప్పబోతుందా..?

  Last Updated: 02 Oct 2024, 08:58 PM IST