సౌత్ స్టార్ హీరోయిన్ గా తిరుగు లేని క్రేజ్ తెచ్చుకున్న సమంత కెరీర్ మధ్యలో ఎన్ని అవాంతరాలు వచ్చినా వాటిని దాటుకుంటూ సినిమాలు చేస్తూ వచ్చింది. సమంత ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందని ఆమె ఫ్యాన్స్ నమ్ముతారు. ఈ క్రమంలో బాలీవుడ్ వెళ్లి అక్కడ వెబ్ సీరీస్ చేసిన సమంత ఇప్పుడు సిటాడెల్ హనీ బనీ సీరీస్ తో రాబోతుంది. ఈ సీరీస్ తో బాలీవుడ్ లో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది సమంత.
ఈ సీరీస్ టీజర్ రిలీజ్ టైం లో సమంత (Samantha) గ్లామర్ షో బాలీవుడ్ మీడియా అంతా డిస్కస్ చేసేలా చేసింది. ఇదిలాఉంటే సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమా చేస్తుంది. ఆ సినిమా హీరోయిన్ మాత్రమే కాదు నిర్మాతగా కూడా కొత్త బాధ్యత మీద వేసుకుంది అమ్మడు. ఇదే కాదు సమంత పెద్ద ప్లానింగ్ తోనే నిర్మాణ రంగంలోకి దిగిందని టాక్.
Also Read : Bhagya Sri Borse : భాగ్య శ్రీ మెరుపులు బాగున్నాయి..!
సమంత మరో రెండు సీరీస్ లను నిర్మించేలా ప్లాన్ చేస్తుందట. సిటాడెల్ (Citadel) సీరీస్ రిలీజ్ అవ్వగానే ఆ ప్రాజెక్ట్ ల గురించి అనౌన్స్ చేస్తుందని తెలుస్తుంది. రాజ్ అండ్ డీకే లతోనే సమంత వెబ్ సీరీస్ లు చేయబోతుందని టాక్. ఫ్యామిలీ మ్యాన్ 2 సీరీస్ తో రాజ్ అండ్ డీకే తో కలిసి పనిచేసిన సమంత వారి టాలెంట్ నచ్చి వారు అడిగితే చాలు కాదనకుండా చేస్తుంది.
ఇక ఇప్పుడు బంగారం (Bangaram) సినిమా తర్వాత మళ్లీ ఆ ఇద్దరి డైరెక్షన్ లోనే సీరీస్ నటించి నిర్మించేందుకు రెడీ అవుతుందట. సమంత ప్లానింగ్ చూసి ఆమె ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.
Also Read : Job Calendar : జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్య ఏది..? – బిఆర్ఎస్ సూటి ప్రశ్న