Samantha Ma Inti Bangaram : సమంత బంగారం పాన్ ఇండియా ప్లానింగ్..!

Samantha Ma Inti Bangaram సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ లో కొన్నాళ్లు వెనక పడినా మళ్లీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

  • Written By:
  • Publish Date - June 17, 2024 / 08:51 AM IST

Samantha Ma Inti Bangaram సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ లో కొన్నాళ్లు వెనక పడినా మళ్లీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. పర్సనల్ లైఫ్ లో ఇబ్బందుల వల్ల కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న సమంత తిరిగి వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే సిటాడెల్ వెబ్ సీరీస్ ని పూర్తి చేసిన సమంత మరోపక్క మా ఇంటి బంగారం అంటూ ఒక సినిమా చేయబోతుంది.

ఈ సినిమాను సమంత తన సొంత బ్యానర్ లో నిర్మిచడం విశేషం. సమంత ఓన్ ప్రొడక్షన్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. సినిమా దర్శకుడు ఎవరన్నది ఇంకా రివీల్ చేయలేదు కానీ సమంత సీక్రెట్ గా సినిమాను పూర్తి చేస్తుందని తెలుస్తుంది. అంతేకాదు మా ఇంటి బంగారం సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

సమంతకు సౌత్ తో పాటుగా నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె చేసిన ఫ్యామిలీ మెన్ 2 పాత్రలో అదరగొట్టి బాలీవుడ్ ఆడియన్స్ ని సైతం మెప్పించింది. అందుకే తన ప్రొడక్షన్ లో వస్తున్న సినిమాను నేషనల్ వైడ్ రిలీజ్ ప్లాన్ చేస్తుంది సమంత. అమ్మడి ప్లాన్ బాగానే ఉంది కానీ పాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ సినిమాలో ఉండేలా చూస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read : Lavanya Tripathi : మెగా కోడలు వాటికి మాత్రమే..!