ఏమాయ చేసావే తో జోడి కట్టిన నాగ చైతన్య – సమంత (Naga Chaitanya and Samantha)లు నిజ జీవితంలో కూడా జోడి కట్టిన విషయం తెలిసిందే. మొదటి సినిమా తర్వాత ప్రేమలో పడిన వీరిద్దరూ కొన్నేళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కారు. వీరి జంట చూసి ఎన్ని జంటలు కుల్లుకున్నాయో..ఎంతమంది ఈర్ష పడ్డారో తెలియంది కాదు..అక్కినేని వంటి పెద్ద ఫ్యామిలీ లో సమంత అడుగుపెట్టడం ఆమె అదృష్టమని అంత మాట్లాడుకున్నారు. పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో పలు గొడవలు జరిగి..చివరకు విడాకులు (Divorce ) తీసుకునే వరకు వచ్చింది. ఇద్దరు కూడా ఇష్టంగా విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపి..ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు.
ప్రస్తుతం చైతు రెండో పెళ్ళికి సిద్దమయ్యాడు. నటి శోభితను వివాహం చేసుకోబోతున్నాడు. ఇప్పటీకే ఎంగేజ్మెంట్ కాగా..డిసెంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలో సమంత.. నాగచైతన్యకు లీగల్ నోటీసులు (Samanta Legal Notice ) ఇచ్చినట్లు వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. వారు కలిసి కొనుగోలు చేసిన ఫ్లాట్ లో సమంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిందని, ఇప్పుడు నాగచైతన్య ఆ ఫ్లాట్ శోభితకు రాసిపెట్టాలని చూస్తున్నాడని ..అందుకే సమంత లీగల్ నోటీసులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఈ నోటీసుల ప్రచారంలో ఎంత నిజం ఉందనేది చూడాలి.
Read Also : Bro Anil Kumar : తనపై జగన్ విపరీతమైన ఒత్తిడి తెచ్చాడు – బ్రదర్ అనిల్‌కుమార్