Site icon HashtagU Telugu

Samantha : తెలుగు వారి ప్రేమ వల్లే ఈరోజు ఇంతగా ఎదిగాను – సమంత

Samantha

Samantha

తెలుగు వారి ప్రేమ వల్లే ఈరోజు ఇంతగా ఎదిగాను అని తెలిపింది సమంత. చాల రోజుల తర్వాత నటి సమంత (Samantha) హైదరాబాద్ (Hyderabad) కు వచ్చారు. నాగ చైతన్య తో విడాకులు , ఆ తర్వాత అనారోగ్యానికి గురి కావడంతో సమంత ఎక్కువగా ముంబై లోనే ఉంటుంది. సినిమా షూటింగ్స్ , ప్రమోషన్ కార్యక్రమాల నిమిత్తం మాత్రమే హైదరాబాద్ కు వస్తుంది. ఇప్పుడు మరోసారి అలాగే హైదరాబాద్ కు వచ్చింది.

అలియా భ‌ట్‌, వేదాంగ్ రైనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో.. వాస‌న్ బాలా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన మూవీ జిగ్రా (Jigra). క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 11 న హిందీ తో పాటు తెలుగు లో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా మేకర్స్ నిన్న (అక్టోబర్ 08) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పార్క్ హయత్ లో ఏర్పాటు చేసారు.

ఈ ఈవెంట్ లో సమంత మాట్లాడుతూ ఇదే వేడుకకు.. త్రివిక్రమ్ శ్రీనివాస్, దగ్గుబాటిరాణా సైతం వచ్చారు. ఈ క్రమంలో రాణాను సమంతా పొగుడుతూ కామెంట్లు చేశారు. రాణాలాంటి అన్నయ్య ప్రస్తుతం ప్రతి అమ్మాయికి కావాలని అన్నారు. రానా నాకు అన్నయ్య అని.. గత నెలలో.. ఒక ఫిమెల్ లీడ్ సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి.. ఫిమెల్ లీడ్ మూవీ ప్రజెంట్ చేస్తున్నారు. అందుకు ఆయన లాంటి అన్నయ్య అందరికి దొరకాలని అన్నారు. అంతేకాకుండా.. ఇదే వేడుకలో హజరైన త్రివిక్రమ్ సైతం.. సమంతాపై ప్రశంసలు కురిపించారు.

హీరోయిన్స్ గా మాకు ఓ బాధ్యత ఉంటుందని , మా సినిమాలు చూసే అమ్మాయిలకు ఎవరి కథలో వారే హీరో అనే విషయాన్ని గుర్తు చేయడం బాగుందని తెలిపింది. అలియా ఆ విషయాన్ని తన సినిమా ద్వారా గుర్తు చేసిందని కొనియాడింది. తెలుగు వారి ప్రేమ వల్లే ఎదిగానన్న సమంతా నాకు జిగ్రాస్ అంటే నా అభిమానులే అంటూ క్లారిటీ ఇచ్చింది. అలాగే కొండా సురేఖ ఇటీవల చేసిన కామెంట్స్ పై సమంత ఏమైనా స్పందిస్తుందేమో అని అంత ఊహించారు కానీ ఆ జోలికి వెళ్ళలేదు.

Read Also : BJP: హర్యానా కొత్త సీఎం ఎవరు?.. అవకాశం ఆయనకేనా..?