Naga Chaitanya: సమంత గురించి మొదటిసారి స్పందించిన నాగచైతన్య.. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటూ?

అక్కినేని హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరు విడాకులు తీసుకొని చాలా రోజులు అవుతున్నా కూడా వ

  • Written By:
  • Publish Date - May 5, 2023 / 07:25 PM IST

అక్కినేని హీరో నాగచైతన్య హీరోయిన్ సమంత విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరు విడాకులు తీసుకొని చాలా రోజులు అవుతున్నా కూడా విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనేది ఇంతవరకు ఎవరు స్పందించలేదు. అంతేకాకుండా ఇద్దరూ ఒకరికి ఒకరు విష్ చేసుకోవడం కానీ స్పందించడం కానీ ఇలాంటివి కూడా చేయలేదు. ఇద్దరికీ ఇక్కడికి వెళ్లినా కూడా విడాకుల కు సంబంధించిన విషయాలు ఎదురుగా ఆ విషయాలను ఎప్పటికప్పుడు దాటివేస్తూ వస్తున్నారు నాగచైతన్య, సమంత.

ఇదిలా ఉంటే మొట్టమొదటిసారి నాగచైతన్య సమంత గురించి స్పందించారు. నాగచైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ.. మేము విడిపోయి రెండేళ్లు అవుతోంది.. ఇద్దరి కలిసి చట్టప్రకారం విడాకులు తీసుకుని ఏడాది అవుతోంది.. న్యాయస్థానం కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో ముందుకు సాగిపోతున్నాము.. జీవితంలోని ప్రతి దశను నేను గౌరవిస్తున్నాను. సమంత మంచి మనిషి. ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి.

మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు ప్రజల్లోకి వెళ్లింది. అదే నన్ను ఎంతో బాధపెట్టింది. అలాగే, ఈ మొత్తం వ్యవహారంలో మరో చెత్త విషయం ఏమిటంటే నా గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం. దీనివల్ల ఆ మూడో వ్యక్తిని అగౌరవపరచినట్లు అయ్యింది. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత జీవితంపై పలువురు నన్ను ప్రశ్నిస్తుంటారు. మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి ప్రశ్నలకు మౌనంగా ఉండేవాడిని. కాకపోతే, ఇప్పటికీ వాళ్లు నా పెళ్లి గురించే ఎందుకు మాట్లాడుతున్నారు? వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారు? ఇదే నాకు అర్థం కావడం లేదు అంటూ నాగచైతన్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.