Site icon HashtagU Telugu

Samantha: సమంత హెల్త్ ట్రీట్ మెంట్ షురూ, ఫొటో వైరల్

Sam

Sam

Samantha: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తాను ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స పొందుతున్నట్లు సమంత రూత్ ప్రభు వెల్లడించారు. నటి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన వైరల్ ఫోటో ఆమె చేతికి ఇంట్రావీనస్ డ్రిప్స్‌తో ఆసుపత్రి బెడ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు కనిపించింది. ఆ పోస్ట్‌లో, ఆమె సూచించిన మందుల వల్ల తాను పొందుతున్న ప్రయోజనాలను వివరించింది.

చాలా నెలలుగా నటనకు విరామం ఇచ్చిన సమంత తన హెల్త్ పై దృష్టి సారిస్తూ అనేక పర్యటనలు చేసింది. ఆమె విరామ సమయంలో కోయంబత్తూర్‌లోని ఓ ఆశ్రమంలో ధ్యానం చేసి ఆధ్యాత్మికతో ప్రయాణం చేసింది. ఆ తరువాత US వెళ్లే ముందు స్నేహితురాలితో  కలిసి బాలిని సందర్శించింది. ఆస్పత్రిలో చేరే ముందు బీచ్ వెకేషన్ ను బాగా ఎంజాయ్ చేసింది. ఈ బ్యూటీ మయోసిటిస్‌తో గత సంవత్సరం నుంచి బాధ పడుతున్నట్టు తెలిపింది.

Also Read: CM KCR: కేసీఆర్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్, పాలమూరు ప్రగతి నివేదిక పుస్తకావిష్కరణ