Site icon HashtagU Telugu

Samantha : అలియా భట్ కోసం సమంత..?

Parvathi Tiruvothu All Praises to Samantha after Watching Citadel Honey Bunny

Parvathi Tiruvothu All Praises to Samantha after Watching Citadel Honey Bunny

పాన్ ఇండియా లెవెలో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్న టైం లో హిందీ సినిమాలు కూడా తెలుగు డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని సక్సెస్ అందుకుంటున్నాయి. అదే దారిలో అలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ జిగ్రా ని తెలుగులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను వసన్ బాల డైరెక్ట్ చేశారు.

ప్రమాదంలో ఉన్న తమ్ముడిని అతని సోదరి ఎలా కాపాడింది అనే కథతో జిగ్రా వస్తుంది. ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఐతే ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు. అలియా బట్ జిగ్రా (Jigra Event) తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంత (Samantha) స్పెషల్ గెస్ట్ గా రాబోతుందని తెలుస్తుంది.

సౌత్ స్టార్ హీరోయిన్ గా..

సౌత్ స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. అక్కడ ఇక్కడ తన క్రేజ్ ను కొనసాగిస్తున్న సమంత హిందీ సినిమా తెలుగు రిలీజ్ కోసం తన వంతు సపోర్ట్ అందిస్తుంది. సమంత ఈవెంట్ కి వస్తే మాత్రం కచ్చితంగా అలియా భట్ సినిమాకు ప్లస్ అవుతుందని చెప్పొచ్చు.

ఈ వారం రోజులుగా సమంత పేరు నిత్యం వార్తల్లో ఉంటుండగా ఈ ఈవెంట్ లో ఆమె ఎలా స్పందిస్తారు.. ఏం మాట్లాడతారు అన్నది ఆసక్తికరంగా మారింది. అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న జిగ్రా సినిమాపై అలియా భట్ (Alia Bhatt) చాలా నమ్మకంగా ఉంది.

సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమా చేస్తున్న అమ్మడు సిటాడెల్ వెబ్ సీరీస్ తో త్వరలో రాబోతుంది.

Also Read : Bigg Boss 8 Wild Card Entries : బిగ్ బాస్ 8.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొదటి రోజే షాక్..!