Samantha : గత కొన్నాళ్లుగా నటిగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఇటీవల నిర్మాతగా శుభం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రాలాలా బ్యానర్ పై సమంత నిర్మాణంలో ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్.. పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన శుభం సినిమా ఇటీవల మే 9న థియేటర్స్ లో రిలీజయింది. ఈ సినిమాలో సమంత చిన్న గెస్ట్ రోల్ కూడా చేసింది.
సీరియల్స్ పిచ్చి ఉన్న ఆడవాళ్లు అనే కాన్సెప్ట్ తో హారర్ కామెడీగా తెరకెక్కించారు ఈ సినిమాని. ఫ్యామిలీలకు, ఆడవాళ్లకు ఈ సినిమా బాగానే కనెక్ట్ అయింది. ఈ సినిమా నాలుగు రోజుల్లో ఆల్మోస్ట్ 6 కోట్లు థియేటర్స్ నుంచే రాబట్టింది. ఈ సినిమాని కేవలం 3 కోట్లతోనే తెరకెక్కించారని సమాచారం. అలాగే జీ5 ఓటీటీ రైట్స్, జీ తెలుగు శాటిలైట్ రైట్స్ ముందే కొనుక్కుంది. వాటి నుంచి కూడా ఆల్మోస్ట్ 3 కోట్ల వరకు వచ్చినట్టు సమాచారం.
దీంతో సమంత నిర్మాతగా మొదటి సినిమా ఫుల్ ప్రాఫిట్స్ లో ఉంది. హీరోయిన్ గా స్టార్ డమ్ చూసిన సమంత ఇప్పుడు మొదటి సినిమాతోనే నిర్మాతగా సక్సెస్ కొట్టింది. శుభం తర్వాత తన నిర్మాణ సంస్థలో సమంతనే హీరోయిన్ గా మా ఇంటి బంగారం అనే సినిమా చేయనుంది. వచ్చే నెలలో ఆ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది.
Also Read : Anasuya : కొత్తింట్లోకి అనసూయ.. గ్రాండ్ గా గృహప్రవేశం.. ఇంటికి ఏమని పేరు పెట్టిందో తెలుసా?