సమంత (Samantha), బాలీవుడ్ నటుడు వరుణ్ ధవన్ (Varun Dhavan) కాంబినేషన్లో వస్తున్న ‘సిటాడెల్: హనీ-బన్నీ’ (Citadel Honey Bunny) వెబ్ సిరీస్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. నవంబరు 07 నుండి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సమంత..మేకర్స్ తో కలిసి దేశ వ్యాప్తంగా ప్రమోషన్ చేస్తూ బిజీ గా మారింది.
ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూల్లో సదరు యాంకర్..రెండో పెళ్లిపై ప్రశ్న అడిగారు. దానికి సామ్ ఏమాత్రం చిరాకు పడకుండా సమాధానం ఇచ్చింది. తాను ఎంతో ఇష్టపడి, ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్నానని, ప్రస్తుతం విడిపోయామని, తన జీవితంలో ఇక రెండో పెళ్లి అనే ప్రసక్తి కానీ, మరో వ్యక్తికానీ ఎవరూ ఉండరని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో అందరూ సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విడిపోయిన కొన్నాళ్లకే శోభిత ధూళిపాళను నాగచైతన్య వివాహం చేసుకుంటున్నాడని, కానీ ప్రేమను, వివాహాన్ని మర్చిపోలేక సమంత మాత్రం అలా చేయలేకపోతోందని, బయటకు కనపడకపోయినప్పటికీ ఇప్పటికీ మానసికంగా దిగులుపడుతోందనే విషయం అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ “సిటాడెల్” ను ఇండియన్ వెర్షన్ లో హనీ బన్నీ” గా అందిస్తున్నారు. ఇద్దరి గూఢచారుల మధ్య ప్రేమ కథతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కలిగిన ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం గట్టి నమ్మకంతో ఉంది.
Read Also: Battalion Constable : బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్ల విషయంలో దిగొచ్చిన ప్రభుత్వం