Site icon HashtagU Telugu

Samantha: సమంత సెక్సీ స్టెప్పులు.. వీడియో వైరల్!

Samantha

Samantha

టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రేజ్ కు ఫుల్ స్టాప్ పడటం లేదు. ఏదో ఒక అంశంతో సమంత చర్చనీయాంశమవుతూనే ఉంది. తాజాగా ఓ పాటకు స్టెప్పులేసిన సామ్ మరోసారి సోషల్ మీడియాను తనవైపు తిప్పుకుంది. ఈ బ్యూటీ తమిళంలో ఫేమస్ అయిన ‘అరబిక్ కుతు’ పాట కోసం అదిరిపొయే స్టెప్పులు వేసి,  మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు. దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘బీస్ట్’ చిత్రంలోని మొదటి సింగిల్ ‘అరబిక్ కుతు’ పాటగా విడుదలైంది. ‘హలమితి హబీబో’ అనే లిరిక్స్‌ తో ఈ పాట ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయ్యింది.

ఈ పాటకు ఫిదా అయిన సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఓ వీడియోను షేర్ చేశారు. అందులో ఆమె ‘అరబిక్ కుతు- హలమితి హబీబో’కి డ్యాన్స్ చేసింది. “జస్ట్ మరో లేట్ నైట్ ఫ్లైట్ కాదు!! ఈ రాత్రికి రిథమ్ బీ #హలమితిహబీబో ” అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పాటను ఎక్కడో ఎయిర్‌పోర్ట్ లో చిత్రీకరించినట్లుగా, సమంత ప్రయాణిస్తున్నట్లు వీడియోను చూస్తే అర్థమవుతోంది. క్యాజువల్  లుక్‌లో, సామ్ మాస్క్ ధరించి డ్యాన్స్ చేసింది. సమంత ప్రస్తుతం తన రాబోయే చిత్రం ‘యశోద’ షూటింగ్‌లో బిజీగా ఉంది, అయితే ఆమె ఖాతాలో మరికొన్ని ప్రాజెక్టులున్నాయి.

Exit mobile version