Samantha : అమ్మాయిలు పెళ్లికి ముస్తాబవుతున్నారా? అయితే సమంతను ఫాలోకండి!

పెళ్లంటే.. పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. ముత్తయిదువలు.. ముచ్చట్లు అంటాడు ఓ సినీకవి. పెళ్లంటే తప్పట్లు.. తాళాలు మాత్రమే కాదు.. కాస్తంతా ఫ్యాషన్ కూడా అని అంటున్నారు నేటి యువతులు.

  • Written By:
  • Publish Date - November 18, 2021 / 01:01 PM IST

పెళ్లంటే.. పందిళ్లు.. సందళ్లు.. తప్పెట్లు.. తాళాలు.. ముత్తయిదువలు.. ముచ్చట్లు అంటాడు ఓ సినీకవి. పెళ్లంటే తప్పట్లు.. తాళాలు మాత్రమే కాదు.. కాస్తంతా ఫ్యాషన్ కూడా అని అంటున్నారు నేటి యువతులు. పెళ్లి ఎవరికైనా మరిచిపోలేని వేడుక. అందుకే ఉన్నంతలో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆశపడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు చీరకట్టు నుంచి పాపిటబిళ్ల వరకు ప్రతిదీ అందంగా ఉండాలని కోరుకుంటారు. ఎలాగో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా మిగిలిపోవాలనుకుంటున్నారా.. అయితే టాలీవుడ్ హీరోయిన్ సమంత ఫ్యాషన్ సెన్స్ ఫాలోకావాల్సిందే మరి.

కౌరీ షెల్

టాలీవుడ్ యంగ్ హీరో ఈ మధ్యకాలంలోనే ఓ ఇంటివాడైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దగ్గుబాటి రానా ప్రీ వెడ్డింగ్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ సమయంలో ‘ఓ బేబీ’ షూటింగ్ లో ఉన్న సమంత అక్కడ ప్రత్యక్షమైంది. సమంత రెండు లేయర్‌ల కౌరీ షెల్ చోకర్‌ని ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రతిఒక్కరూ సమంతపైనే పడ్డాయి.

సిల్వర్ చోకర్

ఏదైనా ఫంకన్ ఉందనగానే కొంతమంది ఆడవాళ్లు అదేపనిగా బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే మినిమల్ జ్యూయలరీ పీస్‌లకే మొగ్గు చూపుతారు. మీరు కూడా మినిమల్ గా ఉండాలనుకుంటున్నారా? అయితే సిల్వర్ చోకర్ ధరిస్తే సో బెటర్. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో అందంగా, సౌకర్యవంతంగానూ ఉంటుంది.

ఎలిగెంట్ బెస్ట్

సింపుల్, సాదాసీదాగా ఉండాలంటే ఎలిగెంట్ బెస్ట్ ఆఫ్షన్. సరైన చీరకట్టుకు సరైన ఎలిగెంట్ మ్యాచ్ అయితే.. ఇక ఏ ఫంక్షన్ అయినా మీరు ప్రత్యేకంగా కనబడుతారు కూడా. టాలీవుడ్ సెలబ్రిటీ సమంత చాలా సందర్భాల్లో ఇలా కనిపించి ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.

ఐ-గ్రాబింగ్

ఎరుపు రంగు పూల చీరలో సమంత లుక్ అదిరిపోయింది. ఆమె స్మోకీ కళ్ళు, ద్రాక్షలాంటి పెదవి రంగుతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ట్రెడిషనల్ నెక్ పీస్ తో తన అందాన్ని మరింత పెంచుకుంటుంది. కాబట్టి అమ్మాయిలు ఈరకమైన స్టయిల్ ను ఫాలోకావచ్చు.

చోకర్

సమంతా రూత్ ప్రభు స్ట్రెయిట్ ప్యాంట్‌తో కూడిన సాధారణ ఎరుపు రంగు కుర్తాను సెలెక్ట్ చేసుకుంటుంటారు. అయితే ఆమె చోకర్ అందరి దృష్టిని ఆకర్షించగలిగింది. ఇది అన్నింటికంటే సమంతకు అత్యంత ఇష్టమైన లుక్ అని అంటోంది.