సమంత (Samantha) మరోసారి తాను విడాకులు తీసుకున్న తరవాత ఎదురైనా వాటిని బయటకు తెలిపి తాను ఎంత బాధపడిందో చెప్పుకొచ్చింది. ఏమాయ చేసావే తో టాలీవుడ్ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సామ్..మొదటి సినిమాతోనే యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకొని అతి తక్కువ టైంలోనే టాప్ హీరోయిన్ జాబితాలో చేరింది. ఇక మొదటి సినిమాతో జోడి కట్టిన చైతు నే..తన రియల్ లైఫ్ పార్ట్నర్ గా ఎంచుకుంది. ఇద్దరు ప్రేమించుకొని ,పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలానికే విడిపోయారు. ఆ తర్వాత ఎవరి బిజీ లైఫ్ లో వారు నిమగ్నమయ్యారు. కానీ సమంత మాత్రం చాల ఇబ్బందులు ఎదురుకోవాల్సి వచ్చింది. విడాకుల అనంతరం మయోసైటిస్ వ్యాధిన పడి చావు అంచులవరకు వెళ్లి క్షేమంగా బయటపడింది.
ప్రస్తుతం వెబ్ సిరీస్ లపై ఫోకస్ చేసిన ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూ లో…విడాకుల అనంతరం ఎదురైనా వాటి గురించి చెప్పుకొచ్చింది. డివొర్స్ తీసుకున్న తర్వాత అమ్మాయిలకు, మహిళలకు ఈ సమాజం కొన్ని ట్యాగ్స్ ఇస్తుంది. సెకండ్ హ్యాండ్, ఆమె జీవితం ఇక వేస్ట్, యూజ్డ్ అని ఎందుకు ట్యాగ్స్ ఎందుకు తగిలిస్తారో తెలీదు. నాకైతే అర్థం కావడం లేదు. ఆ అమ్మాయిని, తన కుటుంబాన్ని ఈ ట్యాగ్స్, విమర్శలు ఎంతగానో బాధిస్తాయి. కష్టాల్లో ఉన్న సదరు మహిళను, అమ్మాయిని ఇవి మరింత ఎక్కువగా నిరాశ పరుస్తాయి. నా గురించి కూడా ఎన్నో అవాస్తవాలను ప్రచారం చేశారు. అవి అబద్ధాలు, అందుకే వాటి గురించి మాట్లాడాలని ఎప్పుడూ అనుకోలేదు. కష్ట సమయంలో నా స్నేహితులు, కుటుం బసభ్యులు చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు” అని సామ్ చెప్పుకొచ్చింది. ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.
Read Also : Gautam Gambhir : స్వదేశానికి గౌతం గంభీర్.. మళ్లీ ఆస్ట్రేలియాకు వెళ్లేది అప్పుడే..