Naga Chaitanya – Samantha Divorce : అక్కినేని ఫ్యామిలీ టార్చర్ భరించలేకనే సామ్ విడాకులు తీసుకుందట

ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగ చైతన్య – సమంత (Naga Chaitanya – Samantha)..పెళ్ళైన కొంతకాలానికే విడాకులు (Divorce ) తీసుకొని షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఎవరికీ వారు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనేది..బయటకు రాలేదు. ఈ ఇద్దరే కాదు కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ బయటకు చెప్పలేదు. తాజాగా సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు..విడాకులు ఎందుకు తీసుకున్నారనే విషయం..నటి మాధవీ లత (Madhavi Latha)కు చెప్పారట. తాజాగా ఓ […]

Published By: HashtagU Telugu Desk
Chai Sam

Chai Sam

ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని నాగ చైతన్య – సమంత (Naga Chaitanya – Samantha)..పెళ్ళైన కొంతకాలానికే విడాకులు (Divorce ) తీసుకొని షాక్ ఇచ్చారు. విడాకుల తర్వాత ఎవరికీ వారు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనేది..బయటకు రాలేదు. ఈ ఇద్దరే కాదు కుటుంబ సభ్యులు కూడా ఎక్కడ బయటకు చెప్పలేదు. తాజాగా సమంత క్లోజ్ ఫ్రెండ్ ఒకరు..విడాకులు ఎందుకు తీసుకున్నారనే విషయం..నటి మాధవీ లత (Madhavi Latha)కు చెప్పారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. మరోసారి వీరి విడాకులపై స్పందించారు.

We’re now on WhatsApp. Click to Join.

సమంతను అక్కినేని ఫ్యామిలీ సభ్యులు మనీ సంపాధించే మిషన్ లాగా చూశారే తప్ప ఏనాడు మనిషిగా చూడలేదని… తాను వృత్తి నుంచి కాస్త బ్రేక్ తీసుకోవాలన్నా తీసుకోనివ్వకుండా.. సినిమాలు చేయాలని టార్చర్ చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆ టార్చర్ భరించలేకే సమంత విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. తాను చెబుతున్నది అంతా నిజమేనని… సమంతకు అత్యంత దగ్గరి వాళ్లే ఈ విషయం తనతో చెప్పారని ఇంటర్వ్యూ లో ఆమె తెలిపింది. అయితే వారిద్దరూ ప్రస్తుతం ఎవరి జీవితాల్లో చాలా సంతోషంగా ఉన్నారని.. కానీ మరోసారి దీనిపై మాట్లాడి వైరల్ అవ్వాలని తనకు లేదని పేర్కొంది. కానీ అమ్మాయిలను డబ్బు సంపాధించే మిషిన్లలాగా చూడొద్దని.. అందరి అమ్మాయిలకు తల్లి కావాలని ఉంటుందని మాధవీ లత స్పష్టం చేసింది. అలాంటి బట్టలు వేసుకోవద్దు, ఇలా ఉండు.. ఈ సినిమాలు తీయు అంటూ ఆర్డర్లు వేస్తూ… ఎవరూ ఎక్కువ కాలం భరించలేరంటూ సెన్సేషనల్ కామెంట్లు చేసింది. అలాగే రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి గురించి కూడా మాధవీ లత మాట్లాడారు. ఆమె తనకు ఎలాంటి సమస్య వచ్చినా వెంనటే స్పందిస్తుందని అలాంటి వారికి తాను ఎప్పుడూ సాయంగా ఉంటానని చెప్పుకొచ్చింది.

Read Also : Mohammed Shami: ట్రోలర్స్ కు దిబ్బ తిరిగే కౌంటర్ ఇచ్చిన షమీ

  Last Updated: 14 Dec 2023, 03:43 PM IST