Site icon HashtagU Telugu

Salman Khan : కాల్పుల టైంలో ఇంట్లోనే సల్మాన్..​ ఈ కేసులో కొత్త అప్‌డేట్స్ ఇవీ..

Salman Khan

Salman Khan

Salman Khan : ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటిపై జరిగిన కాల్పుల వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో విక్కీ గుప్తా, సాగర్ పాల్ ఇద్దరు నిందితులను ముంబై క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరు కాల్పులు జరిపిన తర్వాత ముంబై నుంచి పారిపోయారు. ఈ ఇద్దరు నిందితులను ట్రాక్ చేసిన ముంబై పోలీసులు.. వారు గుజరాత్‌లోని భుజ్‌లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లారు. సోమవారం అర్థరాత్రే వారిని పట్టుకొని ముంబైకి తీసుకొస్తున్నారు. వారిని ముంబైలో విచారించి.. కోర్టు ఎదుట ప్రవేశపెట్టనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ కేసులో ముంబైలోనూ స్థానికంగా పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. నిందితులు ముంబైలో ఉంటున్న ఇంటి ఓనర్‌ను తాజాగా ఇంటరాగేట్ చేశారు. సల్మాన్ ఖాన్(Salman Khan) వద్ద ఇంటివద్దకు వచ్చేందుకు నిందితులు వాడిన టూ వీలర్ పాత ఓనర్‌ను కూడా పిలిపించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇక ఆ టూ వీలర్‌ను నిందితులకు విక్రయించడంలో సహకరించిన ఏజెంట్‌ను కూడా ప్రశ్నించారు. ఈ దర్యాప్తులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.

Also Read : Israel Vs Iran : యుద్ధానికి సై.. ఇజ్రాయెల్‌ ఆర్మీ వర్సెస్ ఇరాన్‌ ఆర్మీ .. ఎవరి బలం ఎంత?

దర్యాప్తులో వెల్లడైన సమాచారం ప్రకారం.. నిందితులు ముంబైలోని  హరిగ్రామ్‌ ప్రాంతంలో గత నెల రోజులుగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు.  నిందితులు కాల్పులు జరిపిన టైంలో సల్మాన్‌ఖాన్‌ ఇంట్లోనే ఉన్నారని పోలీసులు గుర్తించారు. కాల్పులు జరిపిన తర్వాత నిందితులు  మౌంట్‌ మేరీ చర్చి దగ్గర బైక్​ను వదిలేశారు. అక్కడి నుంచి కొంతదూరం పాటు నడుచుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత ఓ ఆటోలో బాంద్రా రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి బోరివలి వైపు వెళ్లే ఓ ట్రైన్‌ను ఎక్కారు. మార్గం మధ్యలో శాంతాక్రజ్‌ రైల్వేస్టేషన్‌లో నిందితులు దిగారు. ఈ కేసుపై మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ముంబై పోలీసులు ప్రత్యేక టీమ్‌లను బిహార్‌, రాజస్థాన్‌, ఢిల్లీ తదితర ప్రాంతాలకు పంపారు. సల్మాన్‌ ఇంటి ముందు ఎప్పుడూ ఒక పోలీసు వాహనం ఉంటుంది. అయితే కాల్పులు జరిగిన టైంలో అది అక్కడ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాగా, సల్మాన్‌ ఇంటిపై కాల్పులు జరిపింది తామేనని గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న ఫేస్​బుక్​ అకౌంట్​ నుంచి ఇటీవల ఓ ప్రకటన వచ్చింది.

Also Read :Bus Falls Off Flyover : ఫ్లైఓవర్‌ నుంచి పడిపోయిన బస్సు.. ఐదుగురి మృతి, 40 మందికి గాయాలు

Exit mobile version