Salman Khan: తండ్రి కావాలని ఉంది కానీ చట్టం ఒప్పుకుంటుందా: సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా ఆప్ కీ అదాలత్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

Published By: HashtagU Telugu Desk
Salman Khan

Whatsapp Image 2023 04 30 At 2.54.52 Pm

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా ఆప్ కీ అదాలత్‌లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. పెళ్లిపై తన స్పందన అడగగా.. సల్మాన్ ఆన్సర్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘అవును.. ప్లాన్ ఉంది కానీ కోడలు కోసం కాదు బిడ్డ కోసం’ అని చెప్పాడు. కానీ భారత చట్టం ప్రకారం ఇది సాధ్యం కాదు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం? అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు సళ్ళు భాయ్.

నిజానికి సల్మాన్ ఖాన్ (Salman Khan) కి పిల్లలంటే చాలా ఇష్టం. కిడ్స్ కార్యక్రమాల్లో సల్మాన్ తరచూ కనిపిస్తూంటాడు. తన మేనల్లుడు అహిల్ శర్మతో సందడి చేశాడు. అల్లుడికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. కరణ్ జోహార్ పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడని చెప్పినప్పుడు. దీనిపై సల్మాన్ ఖాన్ స్పందిస్తూ.. ‘అవును, నేను కూడా అదే చేయాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఆ తర్వాత చట్టం మారింది కాబట్టి ఇప్పుడు చూద్దాం. నాకు పిల్లలంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.

ఇటీవలే సల్మాన్ ఖాన్ నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా విడుదలైంది. ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించగా.. ఈ చిత్రంలో పూజా హెగ్డే, పాలక్ తివారీ, సిద్ధార్థ్ నిగమ్ మరియు భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటించారు. త్వరలో సల్మాన్ ఖాన్ టైగర్ 3 చిత్రంలో కనిపించనున్నాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో అతనితో పాటు కత్రినా కైఫ్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇక సల్మాన్ బిగ్ బాస్ 16కి హోస్ట్‌గా కూడా వ్యవహరించారు.

Read More: Badrinath Highway: చార్ ధామ్ యాత్ర భక్తులకు అలర్ట్.. బద్రీనాథ్ హైవే మూసివేత

  Last Updated: 30 Apr 2023, 02:56 PM IST