Site icon HashtagU Telugu

Salman Khan Shirtless: వావ్.. వాట్ ఏ బాడీ, కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫొటో వైరల్!

Salman

Salman

కండలవీరుడు అనగానే చాలామందికి వెంటనే గుర్తుకు వచ్చేపేరు సల్మాన్ ఖాన్. పేరుకు తగ్గట్టే ఆయన హాల్క్ లా కనిపిస్తుంటారు. వయసు మీద పడుతున్నా బాడీ లుక్  లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ చొక్కా లేని ఫోటోను పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తన రాబోయే చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ విడుదలకు సిద్ధమవుతున్న సల్మాన్ బుధవారం సాయంత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి మంచం మీద కూర్చున్న చొక్కా లేని చిత్రాన్ని షేర్ చేసుకున్నారు. మసక మసక వెలుతురులో సూర్య కిరణాలు వెదజల్లుతున్న సమయంలో తన బాడీతో ఫొటోకు ఫోజులిచ్చారు. డెల్టాయిడ్ కండరాలు, అబ్స్‌తో చిరిగిన అవతార్‌లో అదరగొట్టాడు. “అలా అనిపించవచ్చు కానీ, ఖచ్చితంగా చల్లగా లేదు.” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. సల్మాన్ ఖాన్ హీరోగా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ నటిస్తున్న మూవీ త్వరలోనే విడుదల కానుంది.

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్‌, విక్ట‌రీ వెంక‌టేష్, బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే క‌లిసి డాన్స్ చేసిన ఎంటమ్మా పాట అభిమానుల‌ను, ప్రేక్ష‌కుల‌ను ఊర్రుత‌లూగించింది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ ఎంట్రీ ఇచ్చిన తీరు, ఆయ‌న ఎనర్జీ పాట‌కు మ‌రింత అందాన్ని తెచ్చి పెట్టింది. ప‌సుపు చొక్కా, తెలుపు లుంగీలో రామ్ చ‌ర‌ణ్ స్టైలిష్‌ ఎంట్రీ, ఆయ‌న రియ‌ల్ లైఫ్ ఫ్రెండ్ స‌ల్మాన్ ఖాన్‌, టాలీవుడ్ స్టార్ వెంకీల‌తో వేసిన డాన్స్ వావ్ అనిపిస్తోంది. రామ్‌చరణ్‌-సల్మాన్-వెంకీ కలిసి వేసిన స్టెప్పులు చూడ్డానికి బాగున్నాయి. ఈ పాట యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతోంది.

Also Read: KTR@UK: కేటీఆర్ కు యూకే ఆహ్వానం.. ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ సదస్సులో స్పీచ్!

Exit mobile version