Salman Khan – Ronaldo : సౌదీలో సల్మాన్‌ఖాన్‌కు చేదు అనుభవం.. ఏమైంది ?

Salman Khan - Ronaldo : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను అభిమానులు ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Published By: HashtagU Telugu Desk
Salman Khan Ronaldo

Salman Khan Ronaldo

Salman Khan – Ronaldo : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌ను అభిమానులు ఎంతగా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడికైనా వెళితే..  అనుచరుడు షేరాతో ఎంత టైట్ సెక్యూరిటీ ఉంటుందో మనకు తెలుసు. ఎవరూ సల్మాన్‌ను కలిసే ఛాన్స్ దాదాపు ఉండనే ఉండదు. అటువంటిది సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన ఓ బాక్సింగ్ ఈవెంట్‌ను చూసేందుకు వెళ్లిన సల్మాన్ ఖాన్‌కు తగిన గుర్తింపు దక్కలేదు. ఈ ప్రోగ్రాంలో అంతర్జాతీయ ఫుట్ బాల్ వీరుడు క్రిస్టియానో రొనాల్డో, మన సల్లూ భాయ్ ఒకే వరుసలో ఉన్న సీట్లలో కూర్చొని మ్యాచ్ చూశారు. ఇక్కడిదాకా ఓకే.. కానీ  ఆ తర్వాత అక్కడున్న వారంతా వచ్చి రొనాల్డోతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఈక్రమంలో తన పక్కనే ఉన్న సల్మాన్‌ను రొనాల్డో పెద్దగా పట్టించుకోలేదు. కౌగిలించుకునేందుకు సల్మాన్  ముందుకు వెళ్లగా.. రొనాల్డో మాత్రం అదేం పట్టించుకోకుండా తన పార్ట్‌నర్ జార్జినా రోడ్రిగ్జ్‌తో కలిసి నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

సల్మాన్‌కు ఎదురైన ఈ చేదు అనుభవంపై నెటిజన్స్ నుంచి తీరొక్క స్పందన వస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో యూఏఈలోని అబుధాబిలో జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవ ఈవెంట్ వేళ గౌరవప్రదంగా కలిసేందుకు వెళ్లిన విక్కీ కౌశల్‌ను సల్లూభాయ్ పెద్దగా పట్టించుకోలేదు. చూసీచూడనట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు సల్మాన్‌కు అచ్చం అలాంటి అనుభవమే ఎదురైందని నెటిజన్స్ కామెంట్లు , పోస్టులు, మీమ్స్ పెడుతున్నారు.  విక్కీ కౌశల్‌ను అవైడ్ చేసినందుకు.. సల్మాన్‌కు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. ‘‘రొనాల్డో నే విక్కీ కా బద్లా లే లియా’’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

Also Read: Renjusha Menon : ప్రముఖ నటి ఆత్మహత్య.. షాక్ లో సినీ, టెలివిజన్ ప్రముఖులు..

  Last Updated: 30 Oct 2023, 11:22 PM IST