Salman Vs Lawrence: గుజరాత్ రాష్ట్రంలోని సబర్మతీ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి పదేపదే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు ఇస్తుండటాన్ని మనం చూశాం. ఎట్టకేలకు ఈ బెదిరింపులపై కండల వీరుడు సల్మాన్ మౌనం వీడారు. తనకు లారెన్స్ ఇచ్చిన బెదిరింపులపై మనసులోని మాటను అందరి ముందు బయటపెట్టారు. ‘‘నేను అన్ని విషయాలను దేవుడికి వదిలేశాను. నేను ఎంత కాలం బతుకుతానో నాకు బాగా తెలుసు’’ అని సల్మాన్ స్పష్టం చేశాడు. ‘‘భగవాన్, అల్లా అందరూ పైన ఉన్నారు. నాకు ఎంతైతే ఆయుష్షును దేవుడు రాసిపెట్టాడో.. అంతకాలమే బతుకుతాను. నేను చెప్పదల్చుకున్నది ఒకటే. ఒక్కోసారి ఇంత పెద్ద సంఖ్యలో మందిని వెంటపెట్టుకొని నేను నడవాల్సి వస్తుంటుంది. ఇదే నాకు పెద్ద సమస్యగా అనిపిస్తుంటుంది’’ అని సల్లూభాయ్ చెప్పుకొచ్చారు.
Also Read :Indian Auto Companies : ట్రంప్ 25 శాతం ఆటోమొబైల్ పన్ను.. ఏయే భారత కంపెనీలపై ఎఫెక్ట్ ?
1998లో మొదలైన ఇష్యూ..
1998లో కృష్ణజింకలను వేటాడారనే అభియోగాలను సల్మాన్ ఖాన్(Salman Vs Lawrenc) ఎదుర్కొన్నారు. బిష్ణోయి సామాజిక వర్గం ప్రజలకు కృష్ణజింకలు పరమ పవిత్రమైనవి.లారెన్స్ బిష్ణోయి ఈ వర్గానికి చెందినవారు. తమ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, లేదంటే చంపేస్తామని సల్మాన్ ఖాన్‌ను చాలాసార్లు లారెన్స్ బిష్ణోయి బెదిరించారు. గతేడాది ముంబైలోని బాంద్రాలో ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటిపైకి లారెన్స్ గ్యాంగ్‌కు చెందిన దుండగులు కాల్పులు జరిపారు. ఈనేపథ్యంలో ఎట్టకేలకు ఇప్పుడు సల్లూభాయ్ నోరు విప్పారు.
సికందర్ మూవీలో సల్లూ భాయ్
తన తదుపరి సినిమా ‘సికందర్’కు సంబంధించిన ప్రమోషన్లలో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బిజీగా ఉన్నారు. ఈ రంజాన్ వేళ మార్చి 30న సికందర్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందన నటించారు.