Salaar : సలార్ సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలో తెలుసా?

అసలైన థియేట్రికల్ రైట్స్ ప్రభాస్ గత సినిమాలు ఫ్లాప్ అయినా భారీగానే సేల్ అయ్యాయి.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 07:00 PM IST

ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్(Salaar) సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రెండు పార్టులుగా సలార్ తెరకెక్కుతుండగా మొదటి పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ట్రైలర్, ఓ సాంగ్ రిలీజ్ చేయగా నేడు మరో ట్రైలర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచారు. సలార్ సినిమాకి ప్రమోషన్స్ చేయకపోవడం గమనార్హం.

ఇక సలార్ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఆల్రెడీ శాటిలైట్, డిజిటల్ హక్కులు 200 కోట్లకు పైగా అమ్ముడయ్యాయని సమాచారం వినిపిస్తుంది. ఇక అసలైన థియేట్రికల్ రైట్స్ ప్రభాస్ గత సినిమాలు ఫ్లాప్ అయినా భారీగానే సేల్ అయ్యాయి. ప్రభాస్ తో పాటు ప్రశాంత్ నీల్ మీద నమ్మకంతో సలార్ సినిమా థియేట్రికల్ రైట్స్ ని భారీ రేటుకి కొనుక్కున్నారు.

టాలీవుడ్ సమాచారం ప్రకారం సలార్ తెలంగాణ థియేట్రికల్ రైట్స్ 65 కోట్లు, ఆంద్ర 95 కోట్లు, మిగిలిన మూడు సౌత్ రాష్ట్రాలు 65 కోట్లు, నార్త్ 110 కోట్లు, ఓవర్సీస్ 75 కోట్లకు సలార్ సినిమా రైట్స్ అమ్ముడు పోయాయని సమాచారం. అంటే మొత్తం దాదాపు 405 కోట్లకు సలార్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడయ్యాయి.

అంటే సలార్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 810 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాలి. ఇక కనీసం ప్రాఫిట్స్ రావాలన్నా దాదాపు 1000 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలేవీ ఆ రేంజ్ కలెక్షన్స్ తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు అసలే డంకీ సినిమా కూడా పోటీగా ఉంది. మరి సలార్ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా చూడాలి.

 

Also Read : Niharika : మంచు మనోజ్ సరసన నిహారిక కొణిదెల.. మళ్ళీ హీరోయిన్‌గా రీఎంట్రీ.. ఈసారి హాట్‌గా..