ప్రభాస్ నటించిన సలార్ 1 సూపర్ హిట్ కాగా సలార్ 2 కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే సలార్ 2 కన్నా ముందు ప్రభాస్ ఎన్టీఆర్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. నెక్స్ట్ మంత్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఐతే సలార్ 2 విషయంలో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సైలెంట్ గా ఉన్నాడు. ఐతే ఈలోగా సలార్ మేకర్స్ అనగా హోంబలె ప్రొడక్షన్స్ ప్రభాస్ తో మరో సినిమాకు రెడీ అయినట్టు తెలుస్తుంది.
ప్రభాస్ (Prabhas) తో ఆదిపురుష్ ని తీసిన ఓం రౌత్ డైరెక్షన్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. సలార్ 1 సూపర్ హిట్ కాగా సలార్ 2 ని వెంటనే చేస్తారని భావించిన ఫ్యాన్స్ కి డైరెక్టర్, హీరో ఇద్దరు షాక్ ఇచ్చారు. సలార్ 2 (Salaar 2) విషయంలో ఏం జరుగుతుంది అన్నది బయటకు రావట్లేదు. ఐతే సలార్ 2 కన్నా ముందు హోంబలె బ్యానర్ లో ప్రభాస్ మరో సినిమా చేయడం సర్ ప్రైజ్ చేస్తుంది.
సలార్ మాస్ ఫీస్ట్..
ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. రెబల్ ఫ్యాన్స్ కి సలార్ ఇచ్చిన మాస్ ఫీస్ట్ తెలిసిందే. సలార్ 2 లోనే అసలు కథ మొత్తం ఉంది. మరి అలాంటిది ప్రశాంత్ నీల్ ఈ సినిమాను కాదని మరో సినిమా చేస్తున్నాడో అర్ధం కావట్లేదు. తారక్ తో సినిమా కూడా రెండు భాగాలు ఉంటుందని తెలుస్తుంది.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజా సాబ్ చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత స్పిరిట్ చేయనున్నాడు. ఆ తర్వాత కల్కి 2 ఉంటుందని టాక్.
Also Read : Samantha : స్పెషల్ సాంగ్స్ చేయనని తెగేసి చెప్పేసిన సమంత..!