ప్రభాస్ అభిమానులే కాదు యావత్ సినీ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మూవీ సలార్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) – KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ (Salaar). శృతిహాసన్ హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితర నటులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సలార్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్ 22 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇచ్చేసాడు దుబాయ్‌కి చెందిన క్రిటిక్ ఉమర్ సందు.
We’re now on WhatsApp. Click to Join.
సలార్ చిత్రం గురించి మాటల్లో చెప్పలేమని..సినిమాలో మూడు పాత్రలు బలంగా ఉన్నాయని.. ఇంతకు ముందెన్నడూ చూడని రోల్‌లో ప్రభాస్ అదరగొట్టాడని.. స్క్రీన్ మీద స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు అని , మాస్ పాత్రలు వేయాలంటే ప్రభాస్ మాత్రమే బాస్ అనే రేంజ్‌లో ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అని ఉమేర్ సంధూ ప్రశంసలు కురిపించాడు. ఇక మూవీ లో శృతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రలు బలంగా ఉన్నాయని , శృతి గ్లామర్‌తోనే కాకుండా ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుందన్నారు. తెర మీద శృతిహాసన్ స్టన్నింగ్‌గా కనిపించింది. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ యాక్టింగ్ కూడా అదిరిపోయింది అని అన్నారు. యాక్షన్, ఫైట్స్ డిజైన్, సినిమాటోగ్రఫి ఇలా అన్ని మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయని ఉమర్ చెప్పుకొచ్చారు. ఇక సలార్ కు 4 /5 రేటింగ్ ఇచ్చాడు. మరి ఉమర్ చెప్పినట్లు సినిమా ఉందా లేదా అనేది చూడాలి మరో వారంలో తెలుస్తుంది.
Read Also : Mahesh : గుంటూరు కారం ఏం చేసినా ఫ్యాన్స్ కి నచ్చట్లేదు..!