పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ (Salaar). శృతిహాసన్ హీరోయిన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితర నటులు కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి2 తర్వాత విడుదలైన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లుగా మిగిలాయి. దీంతో ప్రభాస్ అభిమానులు సలార్ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమా తెరకెక్కిందని తెలుస్తుంది. డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ సినిమా తాలూకా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసారు. ఈ సినిమాను చూసిన సెన్సార్ (Salaar Censor Talk) బృందం సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాల బాగా వచ్చాయని..ప్రభాస్ ను ఎలాగైతే అభిమానులు చూడాలనుకుంటున్నారా ఆదే విధంగా డైరెక్టర్ ప్రశాంత్ చూపించాడని సెన్సార్ యూనిట్ చెపుతుంది. ఓవరాల్ గా అభిమానుల అంచనాలకు మించి సినిమా ఉండబోతుందని సెన్సార్ టాక్.
ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే..ఈ సినిమాకు సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాల రైట్స్ దాదాపుగా రూ. 165 కోట్లకి పైగా అమ్ముడైనట్లె తెలుస్తోంది. అలాగే ఈ సినిమా నైజాం రైట్స్ కోసం మైత్రీ మూవీ మేకర్స్‌తో రూ. 60 కోట్లకు డీల్ కుదిరినట్లు వినికిడి. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. మొదటి భాగం సీజ్ ఫైర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ ఫై కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Read Also : Gutka Advertisements: బాలీవుడ్ హీరోలకు మోడీ షాక్