Saif Ali Khans Empire: సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగ పడటం.. ఆయనపై ఆరు కత్తిపోట్లు పొడవడం అనేది సర్వత్రా కలకలం క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు లేదని ముంబైలోని లీలావతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. సైఫ్ వెన్ను భాగంలో అయిన కత్తిపోట్లకు సర్జరీ చేశామని తెలిపారు. ఈ దాడి ఇంట్లో ఉన్న వాళ్ల పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక ఈ అంచనాకు వచ్చామని వారు చెబుతున్నారు. ఈ తరుణంలో మనం సైఫ్ అలీఖాన్ ఆస్తిపాస్తులు, కుటుంబ నేపథ్యంతో ముడిపడిన విశేషాలను తెలుసుకుందాం..
Also Read :Attack on Saif Ali Khan : సైఫ్‌పై దాడి కేసులో కీలక మలుపు.. ఇంట్లో ఉన్నవాళ్ల పనేనా ?
సైఫ్ తల్లిదండ్రులు, ఆస్తిపాస్తులు..
- సైఫ్ అలీఖాన్ నటుడు కాకముందు నుంచే చాలా సంపన్నుడు.
- ఆయనది రాజ కుటుంబ వారసత్వం. పటౌడీ ఫ్యామిలీ(Saif Ali Khans Empire) అంటే వాళ్లదే.
- గురుగ్రామ్‌లో ఉన్న ఇబ్రహీమ్ కోఠీని పటౌడీ ప్యాలెస్ అని పిలుస్తారు. 1935లో దాన్ని నిర్మించారు.
- సైఫ్ అలీఖాన్ పూర్వీకులు పటౌడీ సంస్థానంలో నవాబులు.
- సైఫ్ తాత నవాబ్ ఇఫ్తికార్ అలీఖాన్ తన భార్య బేగమ్ ఆఫ్ భోపాల్‌కు బహూకరించేందుకు 10 ఎకరాల విస్తీర్ణంలో పటౌడీ ప్యాలెస్‌ను నిర్మించారు.
- పటౌడీ ప్యాలెస్ విలువ రూ.800 కోట్లు.
- సైఫ్ తండ్రి పేరు మన్సూర్ అలీఖాన్ పటౌడీ. ఈయన టీమ్ ఇండియా మాజీ ఆటగాడు.
- సైఫ్ తల్లి పేరు షర్మిలా ఠాగూర్.
- మన్సూర్ అలీఖాన్ పటౌడీ కొన్నాళ్లు టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
- తన తండ్రిపై ఉన్న అభిమానంతో కొడుకు సైఫ్ టైగర్స్ ఆఫ్ కోల్‌కతా అనే ఇండియన్ స్ట్రీట్ ప్రీమియం లీగ్ టీమ్‌ను కొన్నారు. 2024 మార్చిలో ఆ జట్టు ఛాంపియన్ షిప్‌లో విజయం సాధించింది.
Also Read :KTR Vs ED : కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం.. ఈడీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత.. దూసుకొచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు
సైఫ్ లగ్జరీ జీవన శైలి..
- సైఫ్ తన భార్య కరీనాకపూర్‌తో కలిసి ముంబైలోని సద్గురుశరణ్ ఏరియాలో ఉన్న విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నారు. సైఫ్ ఉంటున్న ఇంటి విలువ దాదాపు రూ.55 కోట్లు.
- సైఫ్ అలీఖాన్‌కు స్విట్జర్లాండ్‌లోని గస్టాడ్ ప్రాంతంలో విలాసవంతమైన చెక్క ఇల్లు ఉంది. దాని విలువ దాదాపు రూ.33 కోట్లు.
- సైఫ్ కార్ల కలెక్షన్‌లో బెంజ్ ఎస్ క్లాస్‌కు చెందిన ఎస్350డీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, ఆడీ క్యూ7, జీప్ రాంగ్లర్ వంటి కార్లు ఉన్నాయి.
- 12 ఏళ్ల క్రితం ఒక బిల్డర్ ప్రాపర్టీని అప్పగించకపోవడంతో సైఫ్ అలీఖాన్‌కు దాదాపు రూ.40కోట్ల నష్టం వచ్చింది.
- తన తొలి రోలెక్స్ వాచ్‌ను ఇంటి నుంచి దొంగలు చోరీ చేశారని గతంలో సైఫ్ చెప్పారు.
- సైఫ్ ఆస్తుల విలువ దాదాపు రూ.1,200 కోట్లకుపైనే ఉంటుందని అంచనా.
- సైఫ్ ఒక్కో మూవీకి రూ.15 కోట్ల దాకా తీసుకుంటారు.
- సైఫ్ అలీఖాన్ ఒక యాడ్ చేస్తే రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల దాకా తీసుకుంటారు.