Sai Dharam Tej : ఆ హీరోయిన్ తో సాయి తేజ్ పెళ్లి..?

ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ లవ్ లో పడ్డారట. దీంతో ఇండస్ట్రీలో అప్పట్లో ఈ వార్త బాగా వినిపించింది

Published By: HashtagU Telugu Desk
Sdt Wedding

Sdt Wedding

చిత్రసీమలో పుకార్లకు కొదవ ఉండదు. ఏ విషయమైనా జనాలు పట్టించుకోరు కానీ చిత్రసీమకు సంబదించిన ఏ విషయం బయటకు వచ్చిన దాని గురించి తెగ మాట్లాడుకుంటారు. ముఖ్యంగా ఎఫైర్లు అంటే చెవి కోసుకుంటారు. ఉన్నది గోరంత అయితే దానిని కొండత చేసి ప్రచారం చేస్తారు. ఆ హీరో – ఆ హీరోయిన్ తో ..హోటల్ లో ఆ హీరో , ఆ హీరోయిన్..ఆ జంట పెళ్లి చేసుకోబోతున్నారు..ఇలా నిత్యం ఏదోకటి ప్రచారం చేస్తూ వ్యూస్ పెంచుకోవడం చేస్తుంటారు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కు సంబదించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం యంగ్ హీరోలు , హీరోయిన్స్ పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సాయి తేజ్ కూడా హీరోయిన్ మెహరీన్ (Mehreen Pirzada) ను పెళ్లి చేసుకొని సెటిల్ కాబోతున్నాడనే ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఈ ఇద్దరు జవాన్ సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ లవ్ లో పడ్డారట. దీంతో ఇండస్ట్రీలో అప్పట్లో ఈ వార్త బాగా వినిపించింది. అయితే మెహరీన్ ప్రేమను సాయి ధరంతేజ్ ఒప్పుకోలేదని సమాచారం. అందుకే ఇద్దరూ డ్రాప్ అయ్యారు అని తెలుస్తోంది. కానీ ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ కలుసుకున్నారని , అందుకే త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్తలు మళ్లీ తెరపైకి వచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

సాయి తేజ్ ప్రేమ పుకార్లు కొత్తమీ కాదు గతంలో పలువురి హీరోయిన్ల పేర్లు కూడా బాగా చక్కర్లు కొట్టాయి. కానీ వాటిలో ఎలాంటి నిజం లేదని తేలడం తో అంత సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం తేజు..విరూపాక్ష 2 లో నటిస్తున్నాడు.

Read Also : Kalki : కల్కి టీం ఫై పీఠాధీశ్వరుడు ఆగ్రహం

  Last Updated: 22 Jul 2024, 03:57 PM IST