Site icon HashtagU Telugu

Pavala Syamala : నటి పావలా శ్యామలకు మెగా హీరో సాయం

Sai Tej One Lakh Rupees To

Sai Tej One Lakh Rupees To

ఎవరు ఆపదలో ఉన్న..ప్రజలకు ఎంత పెద్ద కష్టం వచ్చిన మేమున్నాం అంటూ ముందుకు వచ్చి సాయం చేయడంలో మెగా హీరోలు (Mega Heros) ముందంటారు. చిరంజీవి (Chiranjeevi) , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ ఇలా మెగా హీరోలంతా కూడా మెగా సాయం చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కూడా నటి నటి పావలా శ్యామలకు ఆర్ధిక సాయం చేసి వార్తల్లో నిలిచారు. పావలా శ్యామలా (Pavala Syamala) ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న తేజ్ తన వంతుగా లక్ష రూపాయాల ఆర్థిక సహాయాన్ని అందించారు. గతంలో పావల శ్యామలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఫిల్మ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ద్వారా ఈ సహాయాన్ని అందజేశారు.

We’re now on WhatsApp. Click to Join.

నాటకాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న శ్యామల.. ‘‘పావలా’’ అనే నాటకంతో మరింతగా ఆకట్టుకున్నారు. అప్పటి నుండి ‘‘పావలా శ్యామల’’ గా మారింది. ఆ తర్వాత చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి వందల చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం గత కొంతకాలంగా అనారోగ్యం..వృద్ధాప్యంతో బాధపడుతుంది. ఈమె విషయం తెలిసి చిత్రసీమ కొంతసాయం చేస్తూ వస్తుండగా..నటి నటులు తమ వంతు సాయం అందిస్తూ వస్తున్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెకు సాయం అందించారు.

తాజాగా.. తేజ్ కూడా పావలా శ్యామలకు ఆర్థిక సాయం చేశారు. తేజ్ సినీ జర్నలిస్టులకు రూ.5 లక్షల విరాళం ఇవ్వగా, అందులో ఒక లక్ష రూపాయలు పావలా శ్యామలకు కేటాయించారు. తనకు సాయి తేజ్ ఆర్థిక సాయం చేయడం పట్ల పావలా శ్యామల కృతజ్ఞతలు తెలియజేశారు. సాయి తేజ్ తనకు సాయం చేస్తానని చాలాకాలం కిందటే మాటిచ్చాడని, కానీ ఆ తర్వాత ఆయనకు యాక్సిడెంట్ కావడంతో ఆ విషయం మర్చిపోయి ఉంటాడని అనుకున్నామని, కానీ ఇప్పటికీ ఆ విషయం గుర్తుపెట్టుకని సాయం అందించడం ఆయన మంచితనానికి నిదర్శనం అని పావలా శ్యామల కొనియాడారు.

Read Also : Telangana Panchayat Elections : ఆగస్టు లో పంచాయతీ ఎన్నికలు – సీఎం రేవంత్ నిర్ణయం