Site icon HashtagU Telugu

BRO Request : మెగా అభిమానులకు సాయి ధరమ్ తేజ్ హెచ్చరిక

Bro Request

Bro Request

పవన్ కళ్యాణ్సాయి ధరమ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్రో (#BRO) మూవీ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో అభిమానులకు సాయి ధరమ్ తేజ్ హెచ్చరిక జారీ చేసారు. మెగా హీరోల సినిమాలు విడుదల అవుతున్నాయంటే అభిమానులు సంబరాలు చేసుకుంటారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే అభిమానులు ఓ పండగల భావిస్తారు. రెండు రోజుల ముందు నుండే థియేటర్స్ ను ముస్తాబు చేయడం , భారీ కట్ ఔట్స్ , ప్లెక్సీ లు ఏర్పాటు చేయడం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటారు.

ఇక రేపు పవన్ నటించిన బ్రో (#BRO Release) చిత్రం రిలీజ్ కాబోతుంది. అభిమానులు సంబరాలు జరిపేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో అభిమానులకు సాయి ధరమ్ తేజ్ కీలక సూచనలు తెలియజేసారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు (Rains) పడుతున్న సంగతి తెలిసిందే. థియేటర్ల వద్ద కరెంటు స్తంభాలు, విద్యుత్ వైర్లు ఉంటాయి. కటౌట్లు, బ్యానర్లు కట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే ఎంతటి ప్రమాదం జరుగుతుందో ఊహించలేం. అందుకే, మెగా అభిమానులకు ట్విట్టర్ వేదికగా జాగ్రత్తలు తెలిపారు సాయిధరమ్ తేజ్.

‘ఎలాంటి సంబరాల కన్నా మీ భద్రత ముఖ్యం. దయచేసి మీ ఉత్సాహం, ప్రేమ కంటే నా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోండి’ అంటూ లేఖ విడుదల చేసారు.

‘డియర్ ఫ్యాన్స్,

ఎలాంటి షరతులు లేని మీ ప్రేమ, ప్రోత్సాహానికి ధన్యవాదాలు. భావోద్వేగాలతో మేం ఉప్పొంగిపోతున్నాం. మీలో ప్రతి ఒక్కరి పట్ల మాకు కృతజ్ఞతా భావం ఉంది.

బ్రో-ది అవతార్ అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను మీరంతా గర్వపడుతున్నారు. మన సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సినిమాను ప్రచారం చేయడానికి, వేడుక చేసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలను ఉద్దేశించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరంతా కలిసి క్రియేటివ్ డిజైన్స్‌తో బ్యానర్లు, కటౌట్లు కడతారు. దీనిలోనే సినిమాపై మీకు ఉన్న ఇష్టం అద్భుతంగా కనిపిస్తుంది. మీ ఉత్సాహం మన సినిమాను ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. ఈ విషయంలో మీ అందరికీ రుణపడి ఉంటాను.

అయితే, అభిమానులు అందరికీ నాదొక విన్నపం. బ్యానర్లు, కటౌట్లు కట్టేటప్పుడు దయచేసి జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించండి. మీ భద్రత నా ప్రపంచం. ఈ క్రమంలో ఎలాంటి ప్రమాదం జరిగినా నేను తట్టుకోలేను. సంబరాలు చేసుకోవడానికి నేను మీ ముందుకు వస్తాను.

మీ ప్రేమ, ప్రోత్సాహం వెలకట్టలేనిది. కానీ, మీ భద్రత, క్షేమం మాకు మరింత ముఖ్యం. మీకు ఆ దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. క్షేమంగా ఉండండి. ఇలాగే మీ ప్రేమను మాపై కురిపించండి’ అని సాయి ధరమ్ తేజ్ తన లేఖలో పేర్కొన్నారు.

సముద్రఖని(Samudrakhani) డైరెక్షన్లో తెరకెక్కిన బ్రో చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించారు. త్రివిక్రమ్ (Trivikram) స్క్రీన్ ప్లే , మాటలు అందించగా , థమన్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ లో పవన్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు.

Read Also:Tamanna : క్లివేజ్ షో తో రెచ్చిపోయిన తమన్నా..