Site icon HashtagU Telugu

Sai Pallavi : స్టార్ తనయుడితో జపాన్ లో సాయి పల్లవి.. ఫోటోతో లీకైన మ్యాటర్..!

Sai Pallavi Star Hero Leaked Photo Viral

Sai Pallavi Star Hero Leaked Photo Viral

తెలుగులో స్టార్ డం కొనసాగిస్తూ అటు తమిళంలో కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్న సాయి పల్లవి (Sai Pallavi) ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టేసింది. బాలీవుడ్ రామాయణ లో సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని తెలిసిందే. అయితే ఆ సినిమా కన్నా ముందే సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ జరుగుతుంది. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ జపాన్ లో షూటింగ్ జరుపుకుంటున్నారు.

జపాన్ లో ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా షూట్ చేయని సప్పోరో ప్రాంతంలో ఈ షూటింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో లీక్ అయ్యింది. సాయి పల్లవి పక్కన జునైద్ హ్యాండ్సం లుక్ తో కనిపించాడు. అయితే అక్కడ స్నో వల్ల ఇద్దరు కూడా స్వెటర్స్ ధరించి ఉన్నారు. ఇదొక లవ్ స్టోరీ అని తెలుస్తుంది.

ఆల్రెడీ జునైద్ మొదటి సినిమా మహరాజ్ అనే ప్రాజెక్ట్ రాబోతుంది. ఆ సినిమాతో పాటుగా సాయి పల్లవితో ఈ మూవీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ వస్తేనే కానీ సినిమా అసలు మ్యాటర్ తెలియదు. ఏది ఏమైనా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన ఫాం కొనసాగించాలని చూస్తుంది.

ఆల్రెడీ రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకోగా అదే దారిలో సాయి పల్లవి కూడా అక్కడ సత్తా చాటాలని అనుకుంటుంది. తప్పకుండా సాయి పల్లవికి బాలీవుడ్ ఎంట్రీ కలిసి వచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు.

Also Read : Trivikram : అల్లు అర్జున్ కోసం త్రివిక్రం ప్లాన్ చేంజ్.. ఈసారి లెక్కకు మించి చేస్తున్నాడట..!