హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో, తన సింప్లిసిటీతో తెలుగుతో పాటు వేరే పరిశ్రమల్లో కూడా భారీగా అభిమానులని సంపాదించుకుంది. మరో వైపు డాక్టర్ కూడా చదివి హాస్పిటల్ కట్టాలని చూస్తుంది. ఇటీవల కొన్ని రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి ప్రస్తుతం మళ్ళీ వరుసగా సినిమాలతో బిజీ అవుతుంది.
సాయి పల్లవికి ఒక చెల్లి కూడా ఉంది. పేరు పూజ కన్నన్(Pooja Kannan). చూడటానికి కూడా కొంచెం సాయి పల్లవిలాగే అనిపిస్తుంది. అప్పుడప్పుడు సాయి పల్లవి తన చెల్లితో కలిసి దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. పూజా కూడా ఓ తమిళ సినిమాలో నటించి మెప్పించింది. దీంతో అంతా ఆమె కూడా అక్కలాగే హీరోయిన్ అవుతుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయలేదు. ఆ సినిమా సమయంలో సాయి పల్లవి చెల్లి అంటూ బాగా వైరల్ అయింది పూజా. తాజాగా మరోసారి వైరల్ అవుతుంది పూజ కన్నన్.
పూజ కన్నన్ తాజాగా ఓ అబ్బాయితో ఉన్న వీడియో తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో షేర్ చేసి.. ఈ క్యూట్ అబ్బాయి నాకు నిస్వార్థమైన ప్రేమని పరిచయం చేసాడు. ప్రేమలో సహనంగా, నిజాయితీగా ఉండటం నేర్పించాడు. ఇతను వినీత్(Vineeth). నా సూర్యకాంతి ఇతనే. ఒకప్పుడు నా క్రైం పార్ట్నర్ ఇప్పుడు నా లైఫ్ పార్ట్నర్ అని పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. వినీత్ అనే అబ్బాయిని పూజా లవ్ చేస్తున్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఈ పోస్ట్ తో చెప్పేసింది పూజ. దీంతో అక్క కంటే చెల్లి చాలా ఫాస్ట్ గా ఉందే అంటూ పలువురు పూజ, వినీత్ లకు కంగ్రాట్స్ చెప్తున్నారు. మరి కొంతమంది సాయి పల్లవి పెళ్లి ఎప్పుడు అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Hanuman : అదరగొడుతున్న హనుమాన్.. 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ.. నాలుగు రోజుల్లోనే..