Sai Pallavi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఉప్పెన మూవీ ఫేమ్ బుచ్చిబాబుతో కలిసి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సినిమా కోసం కలిసి పని చేయనున్నారు. ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ఇటీవలే పూర్తయిందని తెలుస్తోంది. పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేసే పనిలో బుచ్చిబాబు టీమ్ బిజీగా ఉంది. ప్రస్తుతం అందుతున్న వార్తల ప్రకారం.. ఈ మూవీ మేకర్స్ సాయి పల్లవి (Sai Pallavi)ని హీరోయిన్ పాత్ర కోసం ఒక ఎంపికగా పరిశీలిస్తున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. ఈ చర్చలపై ఇంకా క్లారిటీ లేదు కానీ రూమర్లు మాత్రం ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ న్యూస్ నిజం కావాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: Tiger Nageswara Rao: ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు
గార్గి మూవీ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సాయి పల్లవి రీసెంట్ గా కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తోంది. తెలుగులో చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమాకి సాయి పల్లవి సైన్ చేసింది. బుచ్చిబాబు, అతని బృందం రామ్ చరణ్ తదుపరి మూవీలో హీరోయిన్ పాత్ర కోసం సరైన నటి కోసం వెతుకుతున్నారు. ఈ మూవీకి ఇప్పటికే ఎఆర్ రెహమాన్ సంగీతం, నేపథ్య సంగీతాన్ని సమకూర్చనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంతో వెంకట సతీష్ కిలారు నిర్మాతగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కానుందని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రం తరువాత నేషనల్ అవార్డు విన్నర్ బుచ్చిబాబు దర్శకత్వంలో RC16 మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో మొదటి చిత్రంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ కూడా సహనిర్మాతలుగా ఉంటున్నారు. అయితే రామ్ చరణ్ 16వ సినిమాలో ఒక ముఖ్య పాత్ర కోసం విజయ్ సేతుపతిని కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మరి RC16 మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవి ఉంటుందో లేదో తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే..!