Site icon HashtagU Telugu

Sai Pallavi: పెళ్లి వార్తలను కొట్టిపారేసిన సాయిపల్లవి, సరైంది కాదంటూ రియాక్షన్!

Saipallavi1

Saipallavi1

సాయి పల్లవి పెళ్లి రూమర్లను కొట్టేసింది. అయితే సాయి పల్లవి కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్‌కుమార్ పెరియసామితో రహస్యంగా వివాహం చేసుకుంటుందని పుకార్లు వ్యాపించాయి. సాయి పల్లవి మరియు రాజ్‌కుమార్ పెరియసామి సాంప్రదాయ దుస్తులలో దండలతో కనిపించడంతో ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫోటోలు చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో భాగమని, కోలీవుడ్‌లో మొత్తం నటీనటులు మరియు సిబ్బందికి పూలమాల వేయడం ఆనవాయితీగా ఉందని, సాయిపల్లవి పెళ్లిపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఇప్పటికే చిత్ర నిర్మాతలు ఆరోపణలను కొట్టిపారేశారు.

వీటన్నింటి మధ్య సాయి పల్లవి ఘాటుగా స్పందించి పెళ్లి పుకార్లను ట్రాష్ చేసింది. “నిజాయితీగా చెప్పాలంటే, నేను రూమర్‌లను పట్టించుకోను, కానీ అది కుటుంబ సభ్యులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, నేను మాట్లాడాలి. నా సినిమా పూజా కార్యక్రమంలోని పాల్గొన్న ఫొటోలను ఒకటి చేసి ఉద్దేశపూర్వకంగా  ఫొటోలను పోస్ట్ చేశారు. ఇది సరైంది కాదు.’’ అని రియాక్ట్ అయ్యింది.

ఆమె సినిమాల కోసం ఆమె అభిమానులే కాదు సినీ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గార్గిలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్న తర్వాత ఆమె సుదీర్ఘ విరామం తీసుకుంది. ఆమె కమల్ హాసన్ నిర్మిస్తున్న శివకార్తికేయన్ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ఇటీవల చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్యతో ఒక ప్రాజెక్ట్‌కు సంతకం చేసింది.

Also Read: Nadda: దేశాన్ని అన్ని రంగాలలో  అగ్రస్థానంలో నిలపటమే మోడీ లక్ష్యం